2016-07-11 22:38:42.0
నేపాల్కు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా సుశీలా కర్కి నియమితులయ్యారు. సోమవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికే అక్కడ అధ్యక్ష, స్పీకర్ పదవుల్లో తొలిసారిగా మహిళలు ఉన్నారు. మూడునెలలుగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సుశీల కర్కి నియామకాన్ని పార్లమెంటరీ ప్రత్యేక కమిటీ ఆమోదించడంతో ఆమె పూర్తిస్థాయిలో బాధ్యతలు తీసుకున్నారు. సుశీల, బెనారస్ హిందూ యూనివర్శిటీలో రాజకీయ శాస్త్రం చదువుకున్నారు. నేపాల్లో తొలిమహిళా అధ్యక్షురాలిగా విద్యాదేవి, పార్లమెంటులో తొలి మహిళా స్పీకర్‌గా ఒన్సారీ ఘర్తిలు పదవుల్లో ఉన్న […]
http://www.teluguglobal.com/wp-content/uploads/2016/07/sushila-karki.gif
నేపాల్కు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా సుశీలా కర్కి నియమితులయ్యారు. సోమవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికే అక్కడ అధ్యక్ష, స్పీకర్ పదవుల్లో తొలిసారిగా మహిళలు ఉన్నారు. మూడునెలలుగా తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న సుశీల కర్కి నియామకాన్ని పార్లమెంటరీ ప్రత్యేక కమిటీ ఆమోదించడంతో ఆమె పూర్తిస్థాయిలో బాధ్యతలు తీసుకున్నారు. సుశీల, బెనారస్ హిందూ యూనివర్శిటీలో రాజకీయ శాస్త్రం చదువుకున్నారు. నేపాల్లో తొలిమహిళా అధ్యక్షురాలిగా విద్యాదేవి, పార్లమెంటులో తొలి మహిళా స్పీకర్‌గా ఒన్సారీ ఘర్తిలు పదవుల్లో ఉన్న ఈ తరుణంలోనే మరొక అత్యున్నత స్థాయి పదవిని తొలిసారి మహిళ చేపట్టడం విశేషం.