https://www.teluguglobal.com/h-upload/2023/09/25/500x300_830407-bad-breath.webp
2023-09-25 11:55:17.0
కొన్ని సమస్యలు చెప్పుకొనేంత పెద్దవీ కాదు వదిలేసేంత చిన్నవి కాదు. అలాంటి కోవలోకే చేరుతుంది నోటి దుర్వాసన సమస్య.
కొన్ని సమస్యలు చెప్పుకొనేంత పెద్దవీ కాదు వదిలేసేంత చిన్నవి కాదు. అలాంటి కోవలోకే చేరుతుంది నోటి దుర్వాసన సమస్య.
నలుగురిలోకి వెళ్లినప్పుడు ఇది చాలా ఇబ్బంది పెడుతుంది. నోటి దూర్వాసన కారణంగా ఒక్కోసారి విషయం మీద ఎంత పట్టు ఉన్నా మన కాన్ఫిడెంట్‌గా మాట్లాడలేం. ఒక అధ్యనం ప్రకారం ప్రపంచంలో 5 నుంచి 6 శాతం మంది ప్రజలు నోటు దుర్వాసన సమస్యతో బాధపడుతున్నారు. నిజానికి నోటి శుభ్రతను సరిగ్గా పాటించకపోవడం వల్ల దుర్వాసన వస్తుంది.
కానీ కొంతమందికి నోటి శుభ్రత ఎంతగా పాటించినా సమస్య వస్తూ ఉంటుంది. కడుపులో సమస్యలు, ఇతర ప్రాణాంతక వ్యాధుల కారణంగా నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాంటప్పుడు దీన్ని నిర్లక్ష్యం చేయకుండా డాక్టర్‌ను సంప్రదించాలని అంటున్నారు.

ఇక మాములు సమస్యల వల్ల నోటి దుర్వాసన వస్తే నోరు శుభ్రంగా ఉంచుకోవడమే దానికి పరిష్కారం. రోజూ బ్రష్ చేయడం, భోజనం చేసిన తర్వాత నోరు పుక్కిలించడం, తరచూ నీళ్లు తాగడం వంటి జాగ్రత్తలు తీసుకుంటే.. ఈ సమస్య నుంచి బయటపడవచ్చు. అలాగే కొన్ని ఇంటి చిట్కాలతోనూ నోటి దుర్వాసనను దూరం చేసుకోవచ్చు. ఈ సమస్య ఉన్నవారు పెరుగును తినాలి. ఎందుకంటే పెరుగులోని మంచి బ్యాక్టీరియా చెడు బ్యాక్టీరియాను తొలగిస్తుంది. అలాగే లవంగం నోట్లో వేసుకుని చప్పరిస్తూ ఉండడం, తులసి, పుదీనా ఆకులు నవలటం కూడా నోటి దుర్వాసనను తగ్గిస్తాయి. యాపిల్స్‌లో ఉండే ఆక్సిడైజ్డ్ పాలీఫెనాల్స్ నోటి దుర్వాసనను దూరం చేయడానికి సహాయపడతాయి. ఇక నిమ్మకాయలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని అందరికీ తెలుసు. నిమ్మకాయ రసం దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.
అలాగే సోంపు నీటిలో కొంత వేసి కాచి, గోరు వెచ్చగా మారిన తర్వాత ఆ నీటితో పుక్కిలించడం కూడా ఫలితమిస్తుంది. తమలపాకులు నమలడం ద్వారా కూడా మంచిదే.
ఎక్కువసేపు ఆహారం తీసుకోకుండా ఉండటం వల్ల కడుపులో యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. దానివల్ల కూడా నోటి దుర్వాసన వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి టిఫిన్, లంచ్, డిన్నర్‌తో పాటు మధ్య మధ్యలో స్నాక్స్ కూడా తీసుకుంటూ ఉంటే నోటి దుర్వాసనకు చెక్ పెట్టొచ్చు.
Bad Breath,Health Tips,Bad Breath Remedies
Bad Breath, Health, Health Tips, Telugu News, Telugu Global News, Latest Telugu News, Bad Breath Remedies
https://www.teluguglobal.com//health-life-style/how-to-check-bad-breath-963737