నోర్మూయ్‌.. నువ్వే నోర్మూసుకో -విమానంలో ఎయిర్‌హోస్టెస్‌తో గొడవ

2022-12-22 05:49:41.0

“నువ్వు ప్రయాణికుడికి సర్వెంట్‌“ అంటూ మాట్లాడాడు. దాంతో ఎయిర్‌హోస్టెస్‌ కోపగించుకుంది. ”నేను ఉద్యోగిని.. నీకు సర్వెంట్‌”ను కాదు అంటూ గట్టిగా అరిచేసింది.

ఇండిగో ఎయిర్‌లైన్స్‌ విమానంలో ఒక ప్రయాణికుడికి, ఎయిర్‌హోస్టెస్‌కు మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. ఇద్దరూ ఒకరినొకరు నోర్మూసుకో అంటూ తిట్టుకున్నారు. ఈ గొడవ దృశ్యాలను విమానంలోని ఒక ప్రయాణికుడు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

తనకు నచ్చిన‌ ఆహారం ఇవ్వాలంటూ ప్రయాణికుడు విమాన సిబ్బందిపై ఒత్తిడి తేవడంతో వివాదం మొదలైంది. ప్రయాణికుడి ఒత్తిడితో సిబ్బందిలోని ఒక మహిళ క‌న్నీరుపెట్టుకోవ‌డంతో మరో ఎయిర్‌హోస్టెస్ అతడితో మాట్లాడేందుకు వచ్చారు. మీ కారణంగా తన తోటి ఉద్యోగి ఏడుస్తోందని.. అర్థం చేసుకోవాలని కోరారు. బోర్డింగ్ పాస్‌లో ఏం ఉందో దాని ప్రకారమే తాము ఆహారం అందిస్తామని.. పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించాలని ఆమె కోరారు.

అందుకు ప్రయాణికులు దురుసుగా మాట్లాడాడు. “నువ్వు ప్రయాణికుడికి సర్వెంట్‌“ అంటూ మాట్లాడాడు. దాంతో ఎయిర్‌హోస్టెస్‌ కోపగించుకుంది. ”నేను ఉద్యోగిని.. నీకు సర్వెంట్‌”ను కాదు అంటూ గట్టిగా అరిచేసింది. దాంతో అతడు ఎందుకు అరుస్తున్నావ్? షటప్‌ ( నోర్మూసుకో) అంటూ గట్టిగా కేకలు వేశాడు. ఆమె కూడా ఏమాత్రం తగ్గలేదు. ”యూ షటప్‌( నువ్వే నోర్మూసుకో ). నేను నీ సర్వెంట్‌ను కాదు” అంటూ మరింత గట్టిగా అరిచేసింది. ఇద్దరూ పరస్సరం గట్టిగా కేకలు వేసుకుంటుండటంతో విమాన సిబ్బందిలోని మరో మహిళ వచ్చి ఆమెను పక్కకు తీసుకెళ్లారు.

ఈనెల 16న ఇస్తాంబుల్ – ఢిల్లీ మధ్య ప్రయాణిస్తున్న విమానంలో ఈ గొడవ జరిగింది. దాన్ని బుధవారం ఒక ప్రయాణికుడు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయింది.

Argument,Passenger,Air Hostess,Indigo Airlines,Flight