న్యూక్లియర్‌ బేస్‌ల వివరాలు ఇచ్చిపుచ్చుకున్న ఇండియా – పాక్‌

2025-01-01 14:56:38.0

వెల్లడించిన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ

న్యూక్లియర్‌ బేస్‌లు (అణు స్థావరాలు) ఉన్న ప్రాంతాల వివరాలను దయాది దేశాలు ఇండియా – పాకిస్థాన్‌ పరస్పరం అందజేసుకున్నాయి. రెండు దేశాల మధ్య మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయంలో భాగంగానే ఈ ఏడాది న్యూక్లియర్‌ బేస్‌లు వివరాలు ఇచ్చిపుచ్చుకున్నామని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారికంగా వెల్లడించింది. ఒక దేశంలోని న్యూక్లియర్‌ బేస్‌ పై మరో దేశం దాడి చేయవద్దనే ద్వైపాక్షిక ఒప్పందంలో భాగంగా ఈ జాబితాను రెండు దేశాలు 30 ఏళ్లుగా ఇచ్చిపుచ్చుకుంటున్నాయి. 1988 డిసెంబర్‌ 31న రెండు దేశాల మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా 1992 జనవరి ఒకటో తేదీన ఈ సంప్రదాయం మొదలైంది. ఈ ఏడాదితో ఇలా అణు స్థావరాల జాబితాను రెండు దేశాలు మార్పిడి చేసుకోవడం ఇది 34వ సారి అని విదేశాంగ శాఖ వెల్లడించింది.

Nuclear Bases,India,Pakistan,Exchange Information,Ministry of External Affairs