న్యూ ఇయ‌ర్ వేళ అర్ధరాత్రి వ‌ర‌కు మెట్రో స‌ర్వీసులు

2024-12-31 10:23:34.0

కొత్త సంవత్సరం వేళ మెట్రోలో ప్రయాణించే ప్రయాణికులకు గుడ్‌ న్యూస్

నూతన సంవత్సర వేడుకలకు హైదరాబాద్ నగరం సిద్దమవుతోంది. న్యూఇయర్‌ను పెద్ద ఎత్తున గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసేందుకు ప్రజలు ఉత్సాహం చూపుతున్నారు. ఈ క్రమంలో మెట్రో ప్రయాణకులకు గుడ్ న్యూస్ చెప్పింది. అర్ధరాత్రి 12.30 గంటల వరకు మెట్రో సర్వీసులను పొడిగించారు. రాత్రి 12.30 గంటలకు ఆఖరి సర్వీసు అందుబాటులో ఉంటుందని మెట్రో అధికారులు తెలిపారు. మెట్రో సేవ‌ల‌ను హైద‌రాబాద్ ప్ర‌జ‌లు ఉప‌యోగించుకోవాల‌ని, సుర‌క్షితంగా త‌మ గ‌మ్య‌స్థానాల‌కు చేరుకోవాల‌ని అధికారులు సూచించారు. సాధారణంగా ప్రతీరోజూ రాత్రి 11 గంటలకు మెట్రో రైలు నిలిచిపోతుంది. న్యూఇయర్‌ వేళ మెట్రో రైళ్ల సమయాన్ని పొడగిస్తూ మెట్రో అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ అర్ధరాత్రి ఒంటి గంట 15 నిమిషాల వరకు మెట్రో రైలు అందుబాటులో ఉండనుంది. చివరి మెట్రో రైలు ప్రారంభమయ్యే స్టేషన్ నుంచి అర్ధరాత్రి 12 గంటల 30 నిమిషాలకు బయలుదేరి… అర్ధరాత్రి ఒంటి గంట 15 నిమిషాలకు చివరి స్టేషన్ మెట్రోరైలు చేరుకోనుంది.

అయితే మద్యం సేవించి తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలిగిస్తే చర్యలు తప్పవటి రైల్వే అధికారులు హెచ్చరించారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డు, ట్యాంక్‌బండ్ ప్రాంతాల్లో రాత్రి 11 గంటల నుంచి ట్రాఫిక్ అనుమతి ఉండదని పేర్కొన్నారు. అర్థరాత్రి దాటిన తరువాత 2 గంటల వరకు హుస్సేన్ సాగర్ చుట్టూ వాహన రాకపోకలపై అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆంక్షలు విధిస్తామన్నారు. నాగోల్ ఫ్లైఓవర్, కామినేని ఫ్లైఓవర్, ఎల్‌బీనగర్ ఎక్స్ రోడ్‌లోని మల్టీ లెవల్ ఫ్లైఓవర్‌లు బైరామల్ గూడ ఎక్స్‌రోడ్డులోని మొదటి, రెండో లెవల్ ఫ్లైఓవర్‌లు ఎల్‌బీ నగర్ అండర్ పాస్, చింతలకుంట అండర్‌పాస్‌ల మార్గాల్లో రాత్రి 10 గంటల నుంచి ద్విచక్ర వాహనాలు, మోటారు వాహనాలకు, ప్యాసింజర్ వాహనాలకు అనుమతి ఉండబోదని హైదరాబాద్ పోలీసులు తెలిపారు.

Hyderabad metro,Metro services,Metro trains,L&T Services,New Year Celebrations,NTR Marg,Necklace Road,Tankbund,Hyderabad,CM Revanth reddy,Telangana goverment,Hyderabad Police