https://www.teluguglobal.com/h-upload/2024/09/24/1362641-director-mohan-g.webp
2024-09-24 14:19:04.0
తమిళ డైరెక్టర్ ను అరెస్ట్ చేసిన పోలీసులు
పంచామృతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఓ తమిళ దర్శకుడు కటకటాల పాలయ్యాడు. తమిళ్ డైరెక్టర్ జి. మోహన్ కొన్ని రోజుల క్రితం ఒక వీడియోలో ”పళని పంచామృతంలో గర్భనిరోధక మాత్రలు కలపండి” అంటూ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ పై సంప్రదాయవాదులు మండిపడ్డారు. ఆయనపై ఫిర్యాదులు రావడంతో మంగళవారం చెన్నైలోని ఆయన నివాసంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుచ్చికి తరలించి ఆయనను విచారిస్తున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీపై వివాదం నెలకొన్న తరుణంలో తమిళనాడులో పంచామృతంపై డైరెక్టర్ చేసిన కామెంట్స్ కంట్రవర్సీ సృష్టించాయి. ఈ వివాదం ఆయనను కటకటాల్లోకి చేర్చింది.
Panchamritam,Tamilanadu,Film Director,G. Mohan,Arrested