పంజాబ్‌లోని అమృత్‌సర్‌ పీఎస్‌ సమీపంలో పేలుడు

https://www.teluguglobal.com/h-upload/2024/12/17/1386612-blast-punjab.webp

2024-12-17 06:04:01.0

అమృత్‌సర్‌లోని పోలీస్‌స్టేషన్‌ సమీపంలో ఈ ఘటన… రాష్ట్రంలోఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఇది ఆరోసారి

పంజాబ్‌లో పేలుడు కలకలం సృష్టిస్తున్నది. అమృత్‌సర్‌లోని పోలీస్‌స్టేషన్‌ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నది. ఒక్కసారిగా పెద్ద శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు పోలీస్‌స్టేషన్‌ సమీపంలో పేలుడు సంభవించింది. అయితే స్టేషన్‌లో ఎటువంటి పేలుడు జరగలేదని.. ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని పోలీసులు స్పష్టం చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మరోవైపు ఈ పేడు తమ పనే అని జర్మనీకి చెందిన గ్యాంగ్‌స్టర్‌ జీవన్‌ ఫౌజీ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో పోలీసులు 10 మంది అనుమానితులను అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 4న అమృత్‌సర్‌లో మజితా పోలీస్‌ స్టేషన్లో పేడులు సంభవించింది. రాష్ట్రంలోని పోలీస్‌స్టేషన్‌లలో ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం ఇది ఆరోసారి కావడం విశేషం. 

‘Blast-like’ noise,Near police station,Punjab,Amritsar,Gangster Jeevan Fauji