http://www.teluguglobal.com/wp-content/uploads/2016/03/banana.jpg
2016-03-05 06:27:32.0
ఏ పండునయినా మచ్చలు లేకుండా నిగనిగలాడుతున్నదాన్నే కొనవచ్చు కానీ అరటిపండుని మాత్రం మచ్చలను చూసే తినమంటున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే- తొక్క నల్లబడి మచ్చలు ఉంటే అరటిపండు మరింతగా పండిందని అర్థం. చాలామంది ఇలాంటి పళ్లను పాడయిపోయాయని భావించి పారేస్తుంటారు. కానీ ఇలాంటివాటిలో ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ పళ్లలో క్యాన్సర్‌మీద పోరాడే అంశాలు హెచ్చుగా ఉంటాయి. మనిషి శరీరంలో అసహజంగా పెరిగే కణాలమీద ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ పోరాడుతుంది. అంతేకాదు, బ్రౌన్ […]
ఏ పండునయినా మచ్చలు లేకుండా నిగనిగలాడుతున్నదాన్నే కొనవచ్చు కానీ అరటిపండుని మాత్రం మచ్చలను చూసే తినమంటున్నారు పోషకాహార నిపుణులు. ఎందుకంటే-
తొక్క నల్లబడి మచ్చలు ఉంటే అరటిపండు మరింతగా పండిందని అర్థం. చాలామంది ఇలాంటి పళ్లను పాడయిపోయాయని భావించి పారేస్తుంటారు. కానీ ఇలాంటివాటిలో ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది. అంటే ఈ పళ్లలో క్యాన్సర్‌మీద పోరాడే అంశాలు హెచ్చుగా ఉంటాయి. మనిషి శరీరంలో అసహజంగా పెరిగే కణాలమీద ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ పోరాడుతుంది.
అంతేకాదు, బ్రౌన్ రంగులో మచ్చలున్న అరటిపళ్లలో డిప్రెషన్‌మీద పోరాడే లక్షణాలు ఉంటాయి. అలాగే మలబద్దకం, గుండెల్లో మంట, అధిక రక్తపోటు, రక్తలేమి, అల్సర్లు వీటన్నింటికీ మచ్చలు పడిన అరటిపళ్లు ఔషధంలా పనిచేస్తాయి. మనసు బాగోనపుడు, ఒత్తిడికి గురవుతున్నపుడు. ప్రీ మెన్‌స్ట్రువల్ సిండ్రోమ్‌లో కూడా ఈ అరటి పళ్లు మేలు చేస్తాయి.
https://www.teluguglobal.com//2016/03/05/పచ్చవి-కాదు-మచ్చలున/