2024-07-30 04:09:20.0
సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అధికారులు తక్షణం స్పందించి సహాయక చర్యలు ప్రారంభించారు.
https://www.teluguglobal.com/h-upload/2024/07/30/1348247-several-injured-as-coaches-of-howrah-csmt-express-train-derail-in-jharkhands-chakradharpur.webp
జార్ఖండ్‌లో హావ్‌డా – సీఎస్‌ఎంటీ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో 11 మంది ప్రయాణికులు గాయాలపాలయ్యారు. వారిలో ఆరుగురు తీవ్రంగా గాయపడినట్టు అధికారులు వెల్లడించారు. మరో ఐదుగురు స్వల్ప గాయాలతో ప్రాథమిక చికిత్స పొందుతున్నారని తెలిపారు.
జార్ఖండ్‌లోని చక్రధర్‌పూర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. హావ్‌డా నుంచి సీఎస్‌ఎంటీకి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. అధికారులు తక్షణం స్పందించి సహాయక చర్యలు ప్రారంభించారు. ప్రయాణికులను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Several Injured,Coaches,Howrah-CSMT,Express Train,Derail,Jharkhand,Chakradharpur