పట్నం నరేందర్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు

https://www.teluguglobal.com/h-upload/2024/12/18/1387049-patnam-narender-reddy.webp

2024-12-18 12:42:42.0

ఆయనతో పాటు 24 మంది రైతులకు కూడా బెయిల్‌ ఇచ్చిన నాంపల్లి కోర్టు

కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి బెయిల్‌ మంజూరైంది. లగచర్ల కేసులో నరేందర్‌రెడ్డి సహా నిందితులుగా ఉన్న 24 మంది రైతులకు నాంపల్లి కోర్టు బెయిల్‌ ఇచ్చింది. అంతకు ముందే కొండగల్‌ కోర్టులో బెయిల్‌ దాఖలు చేశారు. అయితే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీనికి సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా నమోదు చేసిన కేసులన్నింటినీ నాంపల్లిలోని ప్రత్యేక కోర్టులో విచారించాలని ఇప్పటికే ఆదేశాలున్నాయి. ఈ మేరకు ఈ కేసును కొండగల్‌ కోర్టు నాంపల్లి కోర్టుకు బదిలీ చేసింది. నాంపల్లి కోర్టులో బెయిల్‌ పిటిషన్‌కు సంబంధించి వాదనలు కొనసాగాయి. లగచర్ల కేసులో పట్నం నరేందర్‌రెడ్డిని ఏ1గా చాలామందిని నిందితులుగా చేర్చారు. ఈ కేసులో నరేందర్‌రెడ్డి చర్లపల్లి జైలులో రిమాండ్‌ ఖైదీ గా ఉన్నారు.ఈ కేసులో ఇప్పటికే నరేందర్‌రెడ్డిని, నిందితులను కస్టడీకి తీసుకుని విచారించారు. ఈ నేపథ్యంలోనే పట్నం నరేందర్‌ రెడ్డితో మిగతా నిందితులంతా దర్యాప్తునకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారని వాళ్ల తరపున న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. నరేందర్‌రెడ్డి రూ. 50 వేలు, మిగతా వారు రూ. 20 వేల పూచికత్తు సమర్పించాలని ఆదేశిస్తూ.. నాంపల్లి కోర్టు బెయిల్‌ మంజూరు చేస్తూ తీర్పు వెలువరించింది. 

Bail granted,Patnam Narendra Reddy,Nampally Court Orders,Alleged,Aattack on Govt officers,Lagacharla case