2024-11-12 09:42:37.0
నాలుగైదు నెలల్లో నిర్మిస్తాం : మంత్రి శ్రీధర్ బాబు
పబ్లిక్, ప్రైవేట్ పార్ట్‌నర్ షిప్ లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సిటీ నిర్మిస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం హైదరాబాద్ లో గ్లోబల్ లాజిక్ సాఫ్ట్‌వేర్ కొత్త ఆఫీస్ ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. హైదరాబాద్ నగరం అన్నిరకాల పెట్టుబడులకు అనుకూలమని చెప్పారు. పెట్టుబడులు పెట్టేవారికి తమ ప్రభుత్వం తగిన తోడ్పాటునందిస్తుందన్నారు. మల్టీనేషనల్ కంపెనీలతో పాటుగానే ఎంఎస్‌ఎంఈలకు ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. రాష్ట్రం నుంచి ఏఐ ఎక్స్‌పోర్ట్స్ 12 శాతానికి చేరాయని.. రాబోయే రోజుల్లో మరింత ప్రగతి సాధించేలా ఏఐ సిటీ దోహద పడుతుందన్నారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ కంపెనీలు ఏర్పాటు చేసి స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. స్కిల్ యూనివర్సిటీతో యువతలో నైపుణ్యాలు పెంపొందిస్తామని తెలిపారు.
AI City,PPP Mode,Minister Sridhar Babu,Global Logic Software