పరస్పరం (కవిత)

2023-02-20 17:55:06.0

https://www.teluguglobal.com/h-upload/2023/02/20/723863-parasparam.webp

మేఘాల్లో మెరుపు

ఉరుముల్లో ధ్వని లేకుండా

వర్షం కురవనట్లే

భావాల్లో కాంతి

అక్షరాల్లో శబ్దం లేకుండా

కవిత జనించదు !

విద్యలో వినయం

కృషిలో నిబద్ధత లేకుండా

విజయం వరించనట్లే

బంధంలో ప్రేమ

జీవితంలో నమ్మకం లేకుండా

బతుకు చరించదు !

మాటలో స్వచ్ఛత

బాటలో శుభ్రత లేకుండా

పయనం సాగనట్లే

పనిలో శ్రద్ధ

సాధనలో శ్రమ లేకుండా

విజయం సిద్ధించదు !

కార్యకారణ సంబంధం

చరాచర జగత్తులో అనివార్యం

పరస్పర సహకారం

సృష్టిలో అవశ్యం!

-పి.లక్ష్మణ్ రావ్

( విజయనగరం)

Parasparam,P Laxman Rao,Telugu Kavithalu