పరారీలో కలెక్షన్ కింగ్‌ మోహన్ బాబు

2024-12-13 13:18:00.0

నటుడు మంచు మోహన్‌బాబు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు.

జర్నలిస్టులపై దాడి కేసులో నటుడు మంచు మోహన్ బాబు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోలీసులు 5 చోట్లు మోహన్‌బాబు కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఆయన ఆచూకీ దొరకపోవడంతో పోలీసులు మరికొన్ని ప్రాంతాల్లో గాలిస్తున్నారు. ఇప్పటికే కలెక్షన్ కింగ్‌పై హత్యాయత్నం కేసు నమోదైనా సంగతి తెలిసిందే. ఈకేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని, తదుపరి దర్యాప్తు చేపట్టకుండా పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన కోర్ట్.. అభ్యర్థనను కొట్టివేసింది. ఈ నేపథ్యంలో మోహన్‌బాబును అరెస్ట్ చేయడానికి పోలీసులు ఆయన ఇంటికి వెళ్ళగా.. ఆయన ఇంట్లో లేరు. కాగా మూడు రోజుల క్రితం మోహన్ బాబు ఇంటి వద్ద ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. కుంటుంబ గొడవలు, కేసుల నేపథ్యంలో న్యూస్ కవర్ చేసేందుకు మోహన్ బాబు ఇంటి వద్దకు వెళ్లిన కొందరు జర్నలిస్టులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బూతులు తిడుతూ, లోగోలు లాక్కుని దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో హత్యాయత్నం కేసు నమోదు అయింది.

Manchu Mohanbabu,Journalists,Collection King,Pahadi Sharif Police,Telangana High Court,FIR,Jal Palli,Manchu Manoj,manchu vishnu