2025-01-26 05:00:54.0
సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
తెలంగాణ వ్యాప్తంగా 76వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్యేలు, పాల్గొన్నారు. సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ మాట్లాడుతూ.. ప్రజాప్రభుత్వం తెలంగాణ సంస్కృతికి పెద్దపీట వేస్తుంది. అందెశ్రీ రాసిన జయజయహే గీతాన్ని రాష్ట్ర గీతంగా ప్రకటించామన్నారు. వ్యవసాయం రాష్ట్ర ఆర్థికరంగానికి వెన్నెముక. రైతులను ఆదుకునేందుకు రుణమాఫీ చేశాం.
25 లక్షల మందికిపైగా రైతుల రుణాలు మాఫీ చేశాం. ప్రజా ప్రభుత్వం కర్షకులకు రైతు భరోసా అందిస్తుంది. వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నాం. సన్నరకం బియ్యానికి బోనస్ అందించాం. 2024 వానాకాలంలో 1.59 కోట్ల టన్ను ధ్యానం ఉత్పత్తి చేశాం. ఉచిత బస్సు రవాణాతో మహిళలకు రూ.4500 కోట్లు ఆదాచేశామని చెప్పారు. 50 లక్షల పేద కుటుంబాలకు గృహజ్యోతి అందిస్తున్నాం. యువత సాధికారత కోసం యంగ్ ఇండియా స్కిల్ యూనిర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని గవర్నర్ పేర్కొన్నారు.
Governor Jishnudev,paradegrounds,Secunderabad,Deputy CM Bhatti Vikramarka,Chief Minister Revanth Reddy,Andeshri,Free bus transportation