పలు పలులు ( కవిత )

2023-05-20 14:07:32.0

https://www.teluguglobal.com/h-upload/2023/05/20/767409-palukulu.webp

ఏకాంతాలు ఉపశమనమిస్తాయి

ఏకాంతాలు ఉరితీస్తాయి

నిశ్శబ్దాలు గాయపరుస్తాయి

నిశ్శబ్దాలు చికిత్స చేస్తాయి

ఆశలు ఊరిస్తాయి

ఆశలు పడదోస్తాయి

మౌనాలు మానస సరోవరాలు

మౌనాలు మహా సాగరాలు

చూపులు గుచ్చుకుంటాయి

చూపులు భిక్ష వేస్తాయి

గొంతులు వెక్కిరిస్తాయి

గొంతులు వెన్నుదన్నవుతాయి

జీవితాలు పూలపడవలు

జీవితాలు చిల్లు పడవలు

ప్రాయాలు స్వర్ణ ముద్దలు

ప్రాయాలు గాజుపెంకులు

సత్యాలు నిష్టూరాలు

సత్యాలు కష్టాలు

పదాలు మేకులు

పదాలు పూత రేకులు  .

-తెలుగు వెంకటేష్

Telugu Venkatesh,Telugu Kavithalu