పవన్‌కు NSG సెక్యూరిటీ!

2024-07-20 14:26:02.0

జాతీయ, అంతర్జాతీయ సుపారీ గ్యాంగులు, మావోయిస్టుల నుంచి పవన్‌కు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నట్లు కేంద్రానికి ఇంటెలిజెన్స్‌ సమాచారం ఇచ్చిందట‌.

https://www.teluguglobal.com/h-upload/2024/07/20/1345912-will-center-provide-nsg-security-to-ap-deputy-cm-pawan-kalyan.webp

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు NSG సెక్యూరిటీ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. పవన్‌కు ప్రాణహాని ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైనట్లు తెలిసింది. 18 మంది కమాండోలతో భద్రత ఇవ్వాలనే యోచనలో కేంద్రం ఉంది. పవన్‌తో పాటు ఆయన కుటుంబానికి కూడా భద్రత కల్పించాలని హోంశాఖ సమీక్ష సమావేశంలో నిర్ణయించినట్లు సమాచారం.

నిఘా వర్గాలు రెగ్యులర్‌గా చేసే చెకప్స్‌లో వాళ్లకు కొన్ని అనుమానాలు వ్యక్తం అయ్యాయి. జాతీయ, అంతర్జాతీయ సుపారీ గ్యాంగులు, మావోయిస్టుల నుంచి పవన్‌కు ముప్పు వాటిల్లే అవకాశం ఉన్నట్లు కేంద్రానికి ఇంటెలిజెన్స్‌ సమాచారం ఇచ్చిందట‌. ఎన్డీఏలో జనసేన కీలకంగా ఉండటం, బీజేపీకి పవన్‌ మద్దతు నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. పవన్‌ తీరును తప్పుబడుతూ గతంలోనే మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారు.

ప్రస్తుతం పవన్ కల్యాణ్, భార్యతో కలిసి సింగపూర్‌లో ఉన్నారు. అన్నా లెజినోవా గ్రాడ్యుయేషన్ వేడుకలో ఆయన పాల్గొన్నారు. అన్నా లెజినోవా మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ లో విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. ఈ నేపథ్యంలో ఇవాళ పట్టా అందుకున్నారు.