పవన్‌ కల్యాణ్‌ రియల్‌ లైఫ్‌ హీరో

 

2024-09-26 04:10:34.0

https://www.teluguglobal.com/h-upload/2024/09/26/1363173-pawan.webp

యోగి ఆదిత్యానాథ్‌ తర్వాత అలాంటి విలువలు, తెలివితేటలు కలిగిన ప్రత్యేక రాజకీయవేత్త పవన్‌ అంటూ డైరెక్టర్‌ కృష్ణ వంశీ ప్రశంసలు

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ రియల్‌ లైఫ్‌ హీరో అంటూ క్రియేటివ్‌ డైరెక్టర్‌ కృష్ణ వంశీ కొనియాడారు. ఎప్పుడూ సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఆయన అభిమానులతో తన అభిప్రాయలను పంచుకుంటుంటారు. తాజాగా ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ.. పవన్‌పై ప్రశంసలు కురిపించారు.

‘మీ సినిమాలు అంటే మాకెంతో గౌరవం. ప్రస్తుతం ఏపీలో చర్చనీయాంశంగా మారిన అంశంపై అనుభవం ఉన్న దర్శకుడిగా మీ అభిప్రాయాన్ని తెలుసుకోవాలనుకుంటున్న’ అని ఓ నెటిజన్‌ ఎక్స్‌లో కృష్ణవంశీని అడిగారు. దీనికి ఆయన సమాధానమిస్తూ.. మన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై నాకు ఎంతో ప్రేమ, గౌరవం ఉన్నాయి. అవినీతిమయంగా మారిన రాజకీయాల్లో ఓ వ్యక్తి విలువలు, విశ్వాసాలు నింపడానికి కష్టపడుతున్నారు. భగవంతుడు ఆయనకు ఎప్పుడూ అండగా ఉండాలని కోరుకుంటున్నాను. నిజం ఎప్పటికైనా నిజమే. దాన్ని నిరూపించడానికి ఎవరి అంగీకారం అవసరం లేదు. పవన్‌ కల్యాణ్‌ రియల్‌ లైఫ్‌ హీరో. ఇది మరోసారి రుజువైంది. ఆయన లాంటి రాజకీయ నాయకులు ఎంతోమంది రావాలి. యోగి ఆదిత్యానాథ్‌ తర్వాత అలాంటి విలువలు, తెలివితేటలు కలిగిన ప్రత్యేక రాజకీయవేత్త పవన్‌. దేవుడు ఆయనకు ఎప్పుడూ తోడుగా ఉంటాడు’ అని తెలిపారు.

 

Director Krishna Vamsi,Appreciation,Pawan Kalyan,-Tirumala laddu issue