2024-10-04 10:43:13.0
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ఉద్దేశిస్తూ పరోక్షంగా ట్వీట్ చేశారు. ” సనాతన ధర్మ రక్షణలో మీరు ఉండండి. సమాజ రక్షణలో మేముంటాం. జస్ట్ ఆస్కింగ్ ” అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.
https://www.teluguglobal.com/h-upload/2024/10/04/1366038-prakash-raj.webp
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మరోసారి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ఉద్దేశిస్తూ పరోక్షంగా ట్వీట్ చేశారు. ” సనాతన ధర్మ రక్షణలో మీరు ఉండండి. సమాజ రక్షణలో మేముంటాం. జస్ట్ ఆస్కింగ్ ” అని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. నిన్న తిరుపతిలో వారాహి డిక్లరేషన్ సభలో సనాతన ధర్మం గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే.
ఇతర మతాలను కించపరిస్తే నటులు, సినీ ఇండస్ట్రీ, వ్యాపారులు అందరూ మాట్లాడతారని.. కానీ సనాతన ధర్మంపై దాడులు జరిగితే ఒక్కరు స్పందించరని ఆరోపించారు. సనాతన ధర్మంపై దాడులు జరిగితే ప్రాంతాలు, పార్టీలకు అతీతంగా ధైర్యంగా గొంతు విప్పాలని కోరారు పవన్ కళ్యాణ్. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల నేపథ్యంలో నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి ఆయనని ఉద్దేశిస్తూ పరోక్షంగా ట్వీట్ చేశారు. ప్రకాశ్‌రాజ్, పవన్‌కళ్యాణ్ మధ్య వరుస సంచలన ట్వీట్స్ చేస్తున్నారు ప్రకాష్ రాజ్.