పవన్ కళ్యాణ్‌పై షర్మిల షాకింగ్ కామెంట్స్

2024-10-04 09:23:36.0

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. పవన్ కాంగ్రెస్ రాహుల్ గాంధీపై విమర్శలు చేయడం పెద్ద జోక్ అని విమర్శించారు.

https://www.teluguglobal.com/h-upload/2024/10/04/1365999-shami.webp

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ విజయవాడ కాంగ్రెస్ పార్టీ కార్యలయంలో షర్మిల మీడియాతో మాట్లాడారు. పవన్‌కు పవర్ వచ్చిన తర్వాత వేషం, భాష మారిపోయాయని ఆమె ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి అన్ని మతాలను సమానంగా చూడాలని కోరారు. ఒక హిందూ మతానికి ప్రతినిధిగా పవన్ వ్యవహారిస్తున్నారని షర్మిల విమర్మించారు.

ప్రధాని మోదీ డైరేషన్‌లో పవన్ కళ్యాణ్ యాక్టింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు. జనసేన సెక్యులర్ పార్టీ అనుకున్నాం కానీ.. పవన్ కళ్యాణ్ కూడా ఆర్ఎస్ఎస్ సిద్ధాంతంతో వెళుతున్నారా..? అని నిలదీశారు. మణిపూర్ లో క్రైస్తవులపై ఊచకోత కోస్తే డిప్యూటీ సీఎం అప్పుడు ఎందుకు మాట్లాడలేదని షర్మిల ప్రశ్నించారు . ఇతర మతాల వాళ్లు కూడా ఓట్లు వేస్తేనే పవన్ కళ్యాణ్ గెలిచారు అనే విషయం గుర్తుంచుకోవాలని ఆమె అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శలు చేయడం పెద్ద జోక్ అని ధ్వజమెత్తారు.