పవన్ నేను చెప్పిందేంటి.. మీరు తిప్పున్నదేంటి?

2024-09-24 09:59:23.0

ఏపీ డిప్యూటీ సీఎం వ్యాఖ్యలకు ప్రకాశ్‌ రాజ్‌ కౌంటర్‌

ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ చేసిన వ్యాఖ్యలకు ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఈమేరకు ‘ఎక్స్‌’లో వీడియో పోస్ట్‌ చేశారు. ”పవన్‌ కళ్యాణ్‌ గారు.. ఇప్పుడే మీ ప్రెస్‌మీట్‌ చూశా.. నేను చెప్పినదేంటి? మీరు దాన్ని అపార్థం చేసుకొని తిప్పున్నదేంటి? నేను ఇప్పుడు విదేశాల్లో షూటింగ్‌ లో ఉన్నాను.. 30వ తారీఖు తర్వాత వచ్చి మీ ప్రతి మాటకు సమాధానం చెప్తాను.. ఈ మధ్య మీకు వీలైతే నా ట్వీట్‌ ను మళ్లీ చదవండి.. అర్థం చేసుకోండి..” అని కోరారు. మరో వైపు తమిళ నటుడు కార్తీ తిరుపతి లడ్డుపై చేసిన వ్యాఖ్యలకు ఎక్స్‌ వేదికగా క్షమాపణ చెప్పారు. తిరుమల శ్రీవారి లడ్డుపై సినీ నటులు చేసిన వ్యాఖ్యలపై విజయవాడలో పవన్‌ కళ్యాణ్‌ ఆగ్రహం వ్యక్తం చేయడంతో కార్తీ తన వ్యాఖ్యలపై కార్తీ క్షమాపణ చెప్పారు.

 

tirumala srivari laddu,pavan kalyan,ap deputy cm,prakash raj,karthi