పసిడి ప్రియులకు షాక్.. పెరిగిన బంగారం ధరలు

https://www.teluguglobal.com/h-upload/2022/12/27/500x300_432816-gold-prices-increased-across-the-country-today.webp
2022-12-27 05:11:57.0

మారిన ధరలతో ప్రస్తుతం దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర రూ.49,950గా ఉంది. మరోవైపు.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,480గా ఉంది.

పసిడి ప్రియులకు ఇది ఒకింత ఆందోళన కలిగించే విషయమే. గత కొద్ది రోజులుగా భారీగా పెరుగుతూ హడలెత్తించిన బంగారం ధరలు ఇవాళ (27-12-2022) మరింత పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.100 మేర పెరిగింది. మారిన ధరలతో ప్రస్తుతం దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర రూ.49,950గా ఉంది. మరోవైపు.. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.54,480గా ఉంది. బంగారం ధరతో పోలిస్తే.. వెండి ధర కాస్త ఊరటనిచ్చేలా ఉంది. కిలో వెండి ధర రూ. 71,100 గా పలుకుతోంది. ఇవాళ వెండి ధర పెరగలేదు.. అలాగనీ తగ్గనూ లేదు.. స్థిరంగానే ఉంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలపై ఓ లుక్కేస్తే..

22, 24 క్యారెట్ల బంగారం ధరలు (10 గ్రాములు) వరుసగా..

హైదరాబాద్‌లో రూ.49,950.. రూ.54,480

విజయవాడలో రూ.49,950.. రూ.54,480

విశాఖపట్నంలో రూ.49,950 .. రూ.54,480

చెన్నైలో రూ.50,860.. రూ.55,480

కోల్‌కతాలో రూ.49,950.. రూ.54,480

బెంగళూరులో రూ.50,000.. రూ.54,510

కేరళలో రూ.49,950.. రూ.54,480

ఢిల్లీలో రూ.50,100.. రూ.54,630

ముంబైలో రూ.49,950.. రూ.54,480

వెండి ధరలు..

హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,000

విజయవాడలో రూ.74,000

విశాఖపట్నంలో రూ.74,000

చెన్నైలో కిలో వెండి ధర రూ.74,000

బెంగళూరులో రూ.74,000

కేరళలో రూ.74,000

ఢిల్లీలో కిలో వెండి ధర రూ.71,100

ముంబైలో కిలో వెండి ధర రూ.71,100

Gold prices,Increased,Today,HYD,Chennai
Gold prices, Increased, Today, HYD, Chennai,

https://www.teluguglobal.com//business/gold-prices-increased-across-the-country-today-553724