http://www.teluguglobal.com/wp-content/uploads/2015/10/pasupu.png
2015-10-30 19:02:45.0
భారతీయ సంస్కృతిలో పసుపుకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. యాంటీబయాటిక్‌గా పనిచేసే గుణం పసుపులో ఉంది. క్రిములను అడ్డుకునే స్వభాగం కూడా పసుపు సొంతం. అందుకే మన వాళ్లు ఇంటి గడపకు పసుపు రాస్తుంటారు. పసుపుకు శరీర కాంతిని పెంచే గుణం ఉంది. అందుకు మహిళలు మొహానికి పసుపు రాసుకుంటూ ఉంటారు. ఇలాంటి పసుపుపై ఇటీవల అమెరికా శాస్త్రవేత్తలు మరింత లోతుగా పరిశోధన చేశారు. వారి పరిశోధనల్లో పసుపులో దాగి ఉన్న మరో అద్భుతగుణం వెలుగుచూసింది. మన మనసులోని […]
భారతీయ సంస్కృతిలో పసుపుకు ఎంతో ప్రాముఖ్యం ఉంది. యాంటీబయాటిక్‌గా పనిచేసే గుణం పసుపులో ఉంది. క్రిములను అడ్డుకునే స్వభాగం కూడా పసుపు సొంతం. అందుకే మన వాళ్లు ఇంటి గడపకు పసుపు రాస్తుంటారు. పసుపుకు శరీర కాంతిని పెంచే గుణం ఉంది. అందుకు మహిళలు మొహానికి పసుపు రాసుకుంటూ ఉంటారు. ఇలాంటి పసుపుపై ఇటీవల అమెరికా శాస్త్రవేత్తలు మరింత లోతుగా పరిశోధన చేశారు. వారి పరిశోధనల్లో పసుపులో దాగి ఉన్న మరో అద్భుతగుణం వెలుగుచూసింది.
మన మనసులోని చేదు జ్ఞాపకాలను చెరిపేసే స్వభావం కూడా పసుపుకు ఉందని న్యూయార్క్ సైకాలజిస్టులు చెబుతున్నారు. తాము చేసిన తాజా అధ్యయనంలో ఈ విషయం వెల్లడైందంటున్నారు. మానసిక సమస్యలతో బాధ పడేవారికి పసుపు చికిత్స ఉపయోగ పడుతుందని బల్లగుద్ది చెబుతున్నారు. ఇప్పటికే ఎలుకలపై పసుపు చికిత్స విజయవంతమైందని చెబుతున్నారు. కాబట్టి చేదు జ్ఞాపకాలకు దూరం కావాలనుకునే వారికి పసుపు మంచి మందని అంటున్నారు.. పసుపు వాడకం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ప్రమాదం కూడా లేదంటున్నారు.
Bad Memories,Health Tips,medical news,Turmeric Powder
https://www.teluguglobal.com//2015/10/31/turmeric-powder-use-on-forget-to-bad-memories1/