పాకిస్థాన్‌ కు ఐసీసీ బంపర్‌ ఆఫర్‌

https://www.teluguglobal.com/h-upload/2024/11/26/1381158-champions-trophy-new.webp

2024-11-26 14:42:26.0

హైబ్రిడ్‌ మోడల్‌ కు ఓకే చెప్తే ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తామని హామీ

 

చాంపియన్స్‌ ట్రోఫీలో భారత్‌ తలపడే మ్యాచ్‌ లు హైబ్రిడ్‌ మోడల్‌ లో నిర్వహించేందుకు ఓకే చెప్తే ఆర్థికంగా ఎక్కువ ప్రయోజనాలు కల్పిస్తామని ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చింది. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీని పాకిస్థాన్‌ నిర్వహిస్తోంది. పాక్‌ గడ్డపై క్రికెట్‌ ఆడేందుకు భారత్‌ ససేమిరా అంటోంది. భారత ప్రభుత్వం అందుకు అనుమతి ఇవ్వలేదని బీసీసీఐ ఇటీవలే ఐసీసీకి తేల్చిచెప్పింది. భారత్‌ ఆడే మ్యాచ్‌లు తటస్థ వేదికపై నిర్వహించాలని కోరింది. ఈ నేపథ్యంలోనే ఐసీసీ పాక్‌ క్రికెట్‌ బోర్డుతో సంప్రదింపులు జరుపుతోంది. ఇండియా ఆడే మ్యాచ్‌ లు యూఏఈ వేదికగా నిర్వహిస్తామని పాక్‌ బోర్డుకు సమాచారం ఇచ్చామని, ఒకవేళ ఇండియా ఫైనల్‌ కు చేరితే ఆ మ్యాచ్‌ ను దుబాయ్‌ లో నిర్వహిస్తామని ప్రతిపాదించాని ఐసీసీ వర్గాలు వెల్లడించాయి. దీనిపై ఇంతవరకు పాక్ నుంచి ఎలాంటి స్పందన రాలేదని పేర్కొన్నాయి. తమ ప్రతిపాదనకు పాక్‌ ఓకే చెప్తే అదనపు ఆర్థిక ప్రయోజనాలు కూడా కల్పిస్తామని ఆఫర్‌ చేశామని వివరించాయి. పాక్‌ లో ఆడకపోవడం భారత్‌ సమస్య అని.. మిగిలిన టీమ్‌లకు లేని ఇబ్బంది ఇండియాకు ఎందుకని పాకిస్థాన్‌ వాదిస్తోంది. ఒకవేళ తాము హైబ్రిడ్‌ మోడల్‌ కు అంగీకరించినా గ్రూప్‌ దశలో ఇండియా – పాకిస్థాన్‌ తలపడే మ్యాచ్‌ ను లాహోర్‌లోనే నిర్వహిస్తామని పాక్‌ పట్టుబడుతోంది. ఐసీసీ ఆఫర్‌ పై పాక్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.