పాదాలు మృదువుగా ఉండాలంటే..

https://www.teluguglobal.com/h-upload/2023/09/07/500x300_821735-foot.webp
2023-09-08 07:53:49.0

చాలామందికి కాళ్లు, పాదాల దగ్గర ఉండే చర్మం పొడిబారి పొలుసుల్లా ఊడిపోతుంటుంది. ఈ సమస్యకు ఎన్నో రకాల కారణాలుండొచ్చు. అయితే కొన్ని సింపుల్ టిప్స్‌తో పగిలిన పాదాలను తిరిగి మృదువుగా మార్చుకోవచ్చు.

చాలామందికి కాళ్లు, పాదాల దగ్గర ఉండే చర్మం పొడిబారి పొలుసుల్లా ఊడిపోతుంటుంది. ఈ సమస్యకు ఎన్నో రకాల కారణాలుండొచ్చు. అయితే కొన్ని సింపుల్ టిప్స్‌తో పగిలిన పాదాలను తిరిగి మృదువుగా మార్చుకోవచ్చు. అదెలాగంటే..

అరికాళ్లలోని చర్మం చాలా మందంగా ఉంటుంది. చర్మపు చివరి పొరలవరకూ రక్త ప్రసరణ అందనప్పుడు చర్మం పొడిబారి పగిలిపోతుంటుంది. అందుకే పాదాలకు అప్పుడప్పుడు కొబ్బరినూనె లేదా నువ్వుల నూనెతో మృదువుగా మసాజ్ చేసుకోవాలి. రాత్రిళ్లు ఇలా మసాజ్ చేసి వదిలేస్తే.. కొద్ది రోజుల్లోనే కాళ్లు కోమలంగా తయారవుతాయి. నూనె చర్మం పగుళ్లలోకి వెళ్లి తగిన తేమను అందిస్తుంది. కాబట్టి చర్మం తిరిగి మృదువుగా తయారవుతుంది.

ఒక స్పూన్ నిమ్మరసంలో కొద్దిగా ఆలివ్ ఆయిల్, బ్రౌన్ షుగర్ కలిపి మిశ్రమంగా రెడీ చేయాలి. ఈ మిశ్రమాన్ని అరికాళ్లు, పాదాల వద్ద అప్లై చేసి మృదువుగా మసాజ్ చేయాలి. 20 నిమిషాల తర్వాత వెచ్చని నీళ్లతో కాళ్లను శుభ్రం చేసుకుంటే కొద్దిరోజుల్లోనే పాదాల పగుళ్లు తగ్గుతాయి.

పగిలిన పాదాలకు తేనె అప్లై చేసి మృదువుగా మసాజ్ చేసినా మంచి ఫలితం ఉంటుంది. తేనె పొడిబారిన చర్మాన్ని బాగుచేయడమే కాకుండా మృతకణాలను తొలగిస్తుంది.

ఇక వీటితో పాటు పాదాలు పొడిబారిన వాళ్లు రోజూ కాసేపు మట్టిలో నడవడాన్ని అలవాటు చేసుకొవాలి. దీనివల్ల పాదాల్లో రక్త ప్రసరణ మెరుగుపడుతంది. అలాగే స్నానం చేసిన తర్వాత పాదాలకు మాయిశ్చరైజర్ అప్లై చేయడం వల్ల కూడా ఫలితం ఉంటుంది. మాయిశ్చరైజర్ కు బదులు కలబంద గుజ్జును కూడా వాడుకోవచ్చు.

Soft Feet,Feet,Soft Feet Home Remedy,Telugu Health News
soft feet, soft feet cream, soft feet tips, Soft Feet Home Remedy, Telugu News, Telugu Health News

https://www.teluguglobal.com//health-life-style/how-to-keep-feet-soft-at-home-960199