2025-01-28 12:12:04.0
జూన్‌లోపు ప్రభుత్వంలో ఉన్న అన్ని నామినేటెడ్ పదవులు పూర్తి చేస్తాం అని సీఎం చంద్రబాబు అన్నారు.
జూన్‌లోగా అన్ని నామినేట్‌డ్ పదవుల భర్తీ పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. పార్టీ ముఖ్యనేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి వెల్లడించారు. క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్ సభ్యులనే సిఫారసు చేయాలని సీఎం సూచించారు. మొదటి నుంచి పార్టీని నమ్మకున్న వారికే పదవులు దక్కేలా చూడాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలదేని ఆయన అన్నారు. 214 మార్కెట్ కమిటీలు ఉన్నాయి….1100 ట్రస్ట్ బోర్డులు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ నియామకాలు పూర్తి చేస్తాం.
పదవి పొందిన వాళ్ల రెండేళ్ల పనితీరుపై సమీక్ష చేస్తాం…దాని ఆధారంగా మళ్లీ నిర్ణయాలు, భవిష్యత్ అవకాశాలు ఉంటాయి.దాని ఆధారంగా మళ్లీ నిర్ణయాలు, భవిష్యత్ అవకాశాలు ఉంటాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల నియామకంపై ఎమ్మెల్యేలు సరైన ప్రతిపాదనలు పంపాలి. వ్యవసాయ మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీల్లో పదవి ఆశిస్తున్న వాళ్లు క్యూబ్స్ విభాగాల్లో సభ్యులుగా ఉండాలి. కష్టపడిన కార్యకర్తలు, నాయకులకు న్యాయం చేసేలా నామినేటెడ్ పదవులు ఇస్తామని చంద్రబాబు అన్నారు.
CM Chandrababu,Nominated positions,TDP,Nara lokesh,Agricultural Market Committee,TDP Prisident Vallarapu Srinivas Rao