2025-01-16 09:34:10.0
ఎమ్మెల్యేల అనర్హత కేసులో బీఆర్ఎస్ కీలక నిర్ణయం తీసుకుంది
పార్టీ ఫిరాయింపులపై బీఆర్‌ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని అత్యున్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. కారు గుర్తుపై గెలిచిన10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ పార్టీలోకి మారారు. పది మంది ఎమ్మెల్యేలపై బీఆర్‌ఎస్ ఫిర్యాదు చేసి 9 నెలలవుతున్నా స్పీకర్ నిర్ణయం తీసుకోలేదని పిటిషన్‌లో పేర్కొంది. కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్‌కు వ్యతిరేకంగా ఎస్‌ఎల్‌పీ దాఖలు చేసింది. బీఆర్ఎస్ బీ ఫారం మీద గెలిచి వేరే పార్టీలోకి వెళ్ళిన వీరందరినీ అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద హైకోర్టుకు వెళ్లారు.
ఇరువైపులా వాదనలు విన్న అనంతరం.. పార్టీ మారిన ఎమ్మెల్యేలను తక్షణమే అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేస్తూ హైకోర్ట్ సింగిల్ జడ్జ్ తీర్పునిచ్చారు. సింగిల్ జడ్జి తీర్పుపై అభ్యంతరం తెలుపుతూ.. అసెంబ్లీ సెక్రెటరీ హైకోర్ట్ ప్రత్యేక బెంచ్ కి అప్పీల్ చేయగా.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై ఎప్పుడైనా చర్య తీసుకునే అధికారం స్పీకరుకి ఉందని, టైమ్ బౌండ్ ఏమీ లేదని తీర్పు ఇచ్చింది. గతంలో కేశం మేఘాచంద్ర కేసులో ఇచ్చిన తీర్పు అమలు చేయాలని బీఆర్‌ఎస్ కోరింది. పార్టీల ఫిర్యాదులపై స్పీకర్ 3నెలల్లో నిర్ణయం చెప్పాలని కేశం మేఘా చంద్ర కేసులో ఇచ్చిన తీర్పును బీఆర్‌ఎస్ సుప్రీంకు ప్రస్తావించింది. నాలుగు వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.
Telangana Assembly Elections,BRS Party,KP Vivekananda,High Court,MLA Padi Koushik Reddy,party defections,KTR,Kadiam Srihari,Tellam Venkatarao,Dana Nagender,CM Revanth reddy,Congress party