2024-11-25 07:48:51.0
పార్లమెంట్ ఉభయ సభలు బుధవారానికి వాయిదా పడ్డాయి
https://www.teluguglobal.com/h-upload/2024/11/25/1380684-pa.webp
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారానికి వాయిదా పడ్డాయి. ఇవాళ ఉదయం 11 గంటలకు ప్రారంభమైన ఉభయ సభలు.. తొలుత ఇటీవలేకాలంలో మృతి చెందిన సభ్యులకు సంతాపం తెలిపాయి. ఆ తర్వాత లోక్‌సభ మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడింది. సభ తిరిగి ప్రారంభమైన తర్వాత అదానీ అంశంపై చర్చించాలని విపక్షాలు పట్టుబడ్డాయి. దీంతో సభలో గందరగోళం నెలకొనడంతో లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా సభను బుధవారానికి వాయిదా వేశారు. అటు రాజ్యసభ లోనూ ఇదే పరిస్థితి తలెత్తింది. దీంతో పెద్దల సభను చైర్మన్ ధన్‌కర్ బుధవారానికి వాయిదా వేశారు.
ఉభయ సభలు బుధవారం ఉదయం 11 గంటలకు తిరిగి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20 వరకు జరిగే ఈ సమావేశాల్లో వక్ఫ్ (సవరణ) సహా 16 బిల్లులను ఎన్డీయే సర్కార్ ప్రవేశపెట్టనున్నది. మణిపూర్ హింస, గౌతమ్ అదానీ అవినీతి చర్యలపై యూఎస్ అరెస్ట్ వారెంట్, ఢిల్లీలో వాయు కాలుష్యం తదితర అంశాలపై ఈ సమావేశాల్లో మోదీ సర్కారును నిలదీసేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. పార్లమెంట్ సమావేశాలు అడ్డుకునేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని ప్రధాని మోదీ అన్నారు. రాజ్యాంగం ఆమోదించి 75 సంవత్సరం ప్రారంభమవనుండడం అందులో ఒకటి’’ అని ప్రధాని మోదీ గుర్తుచేశారు. మంచి వాతావరణంలో చర్చలు జరగాలని ఆశిస్తున్నానని ఆయన అన్నారు.
Parliament,Both Houses,Lok Sabha,Rajya Sabha Chairman Dhankar,Winter session of Parliament,Union Minister Kiran Rijiju,PM MODI,Rahul gandhi,President Draupadi Murmu,BAC Meeting,Adani issue,Jamili Election Bill