పార్లమెంట్‌ ముందుకు కీలక బిల్లులు

2025-01-30 07:30:32.0

వలసదారుల నియంత్రణ, వక్ఫ్‌ సవరణ బిల్లు ఈ సమావేశాల్లోనే ఉభయ సభల ముందుకు

https://www.teluguglobal.com/h-upload/2025/01/30/1398779-waqf-jpc-report.webp

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్‌ సమావేశాలపై గురువారం పార్లమెంట్‌ ఆవరణలో స్పీకర్‌ ఓం బిర్లా అధ్యక్షతన ఆల్‌ పార్టీ మీటింగ్‌ నిర్వహించారు. పలువురు కేంద్ర మంత్రులు, వివిధ పార్టీల పార్లమెంటరీ నేతలు సమావేశంలో పాల్గొన్నారు. అంతకు ముందు స్పీకర్‌ ఓం బిర్లాకు వక్ఫ్‌ సవరణ బిల్లుపై ఏర్పాటు చేసిన జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ తన నివేదిక అందజేసింది. జేపీసీ చైర్మన్‌ జగదాంబికా పాల్‌ ఆధ్వర్యంలో ఎంపీలు స్పీకర్‌ను కలిసి నివేదిక సమర్పించారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని స్పీకర్‌ అప్పీల్‌ చేశారు. 2025 – 26 ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌తో పాటు పలు కీలక బిల్లులు ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆయా పార్టీల సభ్యులందరూ సభకు హాజరయ్యేలా చూడాలన్నారు.

పార్లమెంట్‌ ముందుకు వచ్చే బిల్లులివే

పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల్లో 16 బిల్లులు ప్రవేశపెట్టనున్నట్టుగా కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వక్ఫ్‌ బోర్డు సవరణ బిల్లుపై జేపీసీ సమర్పించిన నివేదికను సభలో ప్రవేశపెట్టనున్నారు. అక్రమ వలసదారుల నియంత్రణకు సంబంధించిన ద ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ ఫారినర్స్‌ బిల్‌ను ప్రస్తుత సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్నారు. బ్యాంకింగ్‌ లాస్‌ సవరణ బిల్లు, ఇండియన్‌ రైల్వేస్‌, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌, ఆయిల్‌ ఫీల్డ్స్‌ రెగ్యులేషన్‌ అండ్‌ డెవపల్‌మెంట్‌ సవరణ బిల్లులు సభ ముందుకు రానున్నాయి. బాయిలర్స్‌ బిల్లు, గోవా అసెంబ్లీలో ఎస్టీ రిజర్వుడ్‌ నియోజకవర్గాల రీ అడ్జస్ట్‌మెంట్‌ బిల్లు, ముసల్మాన్‌ వక్ఫ్‌ (రీపీల్‌) బిల్‌, లాడింగ్‌ బిల్‌, కారేజ్‌ ఆఫ్‌ గూడ్స్‌ బై సీ బిల్‌, కోస్టల్‌ షిప్పింగ్‌ బిల్‌, మర్చంట్‌ షిప్పింగ్‌ బిల్‌, ప్రొటెక్షన్‌ ఆఫ్‌ ఇంట్రస్ట్స్‌ ఇన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ అబ్జక్షన్‌ బిల్‌, త్రిబువన్‌ శకరీ యూనివర్సిటీ బిల్లులను ప్రస్తుత సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు.

Parliament Budget Session,Key Bills,Union Budget,Waqf Bill,Immigration Bill,Speaker Om Birla,All Party Meeting,JPC Report