2023-05-26 05:11:50.0
https://www.teluguglobal.com/h-upload/2023/05/26/770813-pitta.webp
పాలపిట్ట కథల పోటీ ఫలితాలు
జీవితకాలమంతా సానుకూల భావనలతో, మంచి పక్షాన నిలిచిన అరిశా సత్యనారాయణ – అరిశా ఆదిలక్ష్మి గార్ల జ్ఞాపకాల స్ఫూర్తిని కేంద్రంగా చేసుకొని పాలపిట్ట నిర్వహించిన కథల పోటీకి కథలు పంపించిన రచయితలు, రచయిత్రులందరికీ ధన్యవాదాలు. ఇతివృత్తాల్లో, కథాకథనంలో వైవిధ్యంతో కూడిన కథలు అనేకం ఉన్నాయి. విభిన్న ప్రాంతాలకు చెందిన కథలు వచ్చాయి. ఈ పోటీకి దాదాపు మూడువందలకు పైగా కథలు రావడం తెలుగునాట కథారచన విస్తృతిని తెలియజేస్తున్నది. కథావస్తువులో వైవిధ్యం అపారంగా ఉన్నది. వర్తమాన జీవితంలోని వాస్తవాలను, వాటి వెనుక దాగి వున్న ఘర్షణలను, జీవన సంక్షోభాలను కథలుగా చెప్పడానికి రచయితలు ప్రయత్నించారు. మరీ ముఖ్యంగా మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి కుటుంబాలలోని వైరుధ్యాలను ఇతివృత్తాలుగా స్వీకరించి కథారచన చేయడానికి ప్రాధాన్యమిచ్చారు రచయితలు. పోటీకి నిర్దేశించుకున్న ప్రమాణాలని కేంద్రంగా చేసుకొని, ఎంపిక క్రమాన వచ్చిన కథలని పరిశీలించడమైనది. పలు దఫాలుగా చదివిన తరువాత ఈ పోటీలో గెలుపొందిన కథల, విజేతల వివరాలు ఇక్కడ అందిస్తున్నాం.
మొదటి బహుమతి: గీతలు చెడిపి… – శాంతినారాయణ
రెండో బహుమతి: తోడు – టి.వి.ఎల్. గాయత్రి
మూడో బహుమతి: ఈతరం కథ – కోటమర్తి రాధా హిమబిందు
ప్రత్యేక బహుమతులు
1. సీతపిన్ని – కృపాకర్ పోతుల
2. మౌనం రాగమైన వేళ! – నాదెళ్ల అనురాధ
3. పగటి చూపు – జడా సుబ్బారావు
4. తోడేళ్ళు – సాగర్ల సత్తయ్య
5. మంచితనం – గన్నవరపు నరసింహమూర్తి
– గుడిపాటి, ఎడిటర్, పాలపిట్ట
Palapitta Story,Results,Story Competition