పితృ దేవోభవ … ఆచార్య దేవోభవ

2023-06-20 03:23:50.0

https://www.teluguglobal.com/h-upload/2023/06/20/785134-pitru-devo.webp

గురుస్థానం లో బోధకుడిగా

తండ్రి స్థానంలో ప్రబోధకుడిగా

అడ్డాలనాటి నుంచీ

గడ్డాలనాటి వరకూ

తోడుగా, నీడగా

అండగా, ఆలంబనగా

కొలువుకు బయల్దేరుతున్న వేళ

కొండంత ధైర్యాన్నిస్తూ,

ఆనందాన్నీ,

కించిత్తు గర్వాన్నీ,

రెక్కలొచ్చి ఎగరబోతున్న కొడుక్కి

శుభాకాంక్షలు

చెప్పేవేళ …

గుండెల్లో గుబులును

మునిపంట నొక్కిపెట్టి

కనుకొలకుల్లో చేరిన చెమ్మను చెరిపేసుకుంటూ …

ధైర్యంగానే ఉన్న అమ్మకి

తన బేలతనాన్ని ఆపాదిస్తూ…

బోలెడంత బోల్డుగా ఉండాలని చెబుతూ …

కన్ను నొచ్చినా

కాలు నొచ్చినా

కావలి కాసి

కాస్తంత ఉపశమించేవరకూ

కంగారు పడిన

నా నాన్న కి …

సముద్రమంత సహనశీలి అయిన నాన్నత్వాన్ని సముద్రాల గారు

సంక్షిప్తం చేసినట్టు …

దేహము.. విజ్ఞానము..

బ్రహ్మోపదేశమిచ్చి

ఇహపరాలు సాధించే

హితమిచ్చిన తండ్రి కి…

నా ఒక్క నాన్నకి మాత్రమే కాకుండా

లోకంలో అందరి నాన్నలకూ … ప్రేమతో

హ్యాపీ ఫాదర్స్ డే

– సాయి శేఖర్

A Saye Sekhar,Telugu Kavithalu,fathers day