పినిపె విశ్వరూప్‌ కుమారుడు అరెస్ట్‌!

2024-10-21 03:20:59.0

దళిత యువకుడి హత్య కేసులో ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం

https://www.teluguglobal.com/h-upload/2024/10/21/1370901-telugu-global-breaking-news.webp

దళిత యువకుడి హత్య కేసులో మాజీ మంత్రి, అమలాపురం మాజీ ఎమ్మెల్యే పినిపె విశ్వరూప్‌ కుమారుడు పినిపె శ్రీకాంత్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసినట్లు తెలుస్తోంది. తమిళనాడులోని మధురైలో ఉన్న శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకుని అక్కడ న్యాయమూర్తి ముందు హాజరుపరిచినట్లు సమాచారం. ట్రాన్సిట్‌ వారెంట్‌ ద్వారా ఏపీ పోలీసులు ఆయనను కస్టడీకి తీసుకున్నారు. అంబేద్కర్‌ కోనసీమ జిల్లాలోని కొత్తపేట డీఎస్పీ ముందు హాజరుపరిచి నిందితుడిని విచారించనున్నారు. అనంతరం రిమాండ్‌కు తరలిస్తారు. అయితే శ్రీకాంత్‌ అరెస్ట్ ను పోలీసు అధికారులు నిర్ధారించాల్సి ఉన్నది.