https://www.teluguglobal.com/h-upload/2023/08/11/500x300_809114-obesity.webp
2023-08-14 12:34:05.0
ఒబెసిటీతో ఉండే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. చాలారకాల అనారోగ్యాలకు ఒబెసిటీ ఒక కారణంగా ఉంటోంది. అయితే ఈ ఒబెసిటీ ఇప్పుడు చిన్న వయసు నుంచే మొదలవుతుంది. ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో ఒబెసిటీ రోజురోజుకీ పెరిగిపోతోందని రీసెంట్ స్టడీలు చెప్తున్నాయి.
ఒబెసిటీతో ఉండే సమస్యలు అన్నీ ఇన్నీ కావు. చాలారకాల అనారోగ్యాలకు ఒబెసిటీ ఒక కారణంగా ఉంటోంది. అయితే ఈ ఒబెసిటీ ఇప్పుడు చిన్న వయసు నుంచే మొదలవుతుంది. ప్రపంచవ్యాప్తంగా పిల్లల్లో ఒబెసిటీ రోజురోజుకీ పెరిగిపోతోందని రీసెంట్ స్టడీలు చెప్తున్నాయి. ఒక్క మనదేశంలోనే సుమారు 1.44 కోట్ల మంది పిల్లలు అధిక బరువుతో ఉన్నారని అంచనా. మరి దీన్ని తగ్గించేదెలా?
చిన్న వయసులోనే బరువు పెరగడం వల్ల యంగ్ ఏజ్‌కు వచ్చేసరికి బీపీ, కొలెస్ట్రాల్, షుగర్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. గుండె సమస్యలకు కూడా ఒబెసిటీనే ముఖ్య కారణంగా ఉంటోంది. పైగా తక్కువ వయసులోనే ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు వాటిని తగ్గించడం కూడా కష్టమవుతుంది. కాబట్టి పిల్లలు బరువుపెరగకుండా తల్లిదండ్రులే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
బాల్యంలోనే జాగ్రత్త పడితే ఒబెసిటీ సమస్యను పూర్తిగా తగ్గించొచ్చు. దీనికోసం చిన్నప్పటి నుంచే పిల్లలతో ఆటలాడించాలి. వ్యాయామాలు వంటివి చేయించాలి. పిల్లల ఆహార అలవాట్ల మీద ఓ కన్నేసి ఉంచాలి. జంక్ ఫుడ్ ఎక్కువగా పెట్టకూడదు. బడికి వెళ్లే పిల్లలు, టీనేజ్ పిల్లలకు రోజుకి 60 నిమిషాల పాటు అయినా వ్యాయామం ఉండాలని డాక్టర్లు చెప్తున్నారు. అలాగే పిల్లల్ని ఎక్కువసేపు సెల్ ఫోన్, ల్యాప్‌ట్యాప్ స్క్రీన్‌ల ముందు కూర్చోనివ్వొద్దు.
పిల్లల డైట్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పిల్లలకు పెట్టే ఆహారంలో అన్ని పోషకాలు ఉండేలా చూసుకోవాలి. పిల్లలు తినట్లేదు కదా అని వాళ్లు అడిగిన చిరుతిండ్లు ఇవ్వకూడదు. ఎలాగైనా వాళ్లతో పండ్లు, కాయగూరలు, పప్పులు, ధాన్యాలు తినేలా అలవాటు చేయాలి. ఫాస్ట్ ఫుడ్, కూల్‌డ్రింకులు, చిప్స్, కేకుల వంటి హైకేలరీ ఫుడ్స్ జోలికి వెళ్లనీయొద్దు. పోషకాలు ఉండే ఆహారాలను రుచిగా తయారుచేసి ఇవ్వాలి. అలాగే పిల్లలు ఆహార నియమాలు పాటించాలంటే పెద్దలు కూడా వాటిని పాటించాలి. అంటే పిల్లల ముందు జంక్ ఫుడ్ తినడాన్ని పెద్దలు కూడా తగ్గించాలి.
Obesity,Children Obesity,Obesity Problems,obesity health tips,Health Tips
obesity, obesity tips, reduce obesity in child, telugu, telugu news, telugu global news
https://www.teluguglobal.com//health-life-style/how-to-reduce-obesity-in-child-in-india-955140