https://www.teluguglobal.com/h-upload/2022/10/13/500x300_416601-obesity-in-children.webp
2022-10-13 12:27:49.0
మనదేశంలో ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు ఊబకాయంతో ఉంటున్నారని ఒక అధ్యయనంలో తేలింది. మారిపోతున్న లైఫ్‌స్టైల్ కారణంగా పిల్లలు చిన్నవయసులో ఒబేసిటీ బారిన పడుతున్నారు.
మనదేశంలో ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు ఊబకాయంతో ఉంటున్నారని ఒక అధ్యయనంలో తేలింది. మారిపోతున్న లైఫ్‌స్టైల్ కారణంగా పిల్లలు చిన్నవయసులో ఒబేసిటీ బారిన పడుతున్నారు. ముఖ్యంగా ఐదు సంత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు బరువు పెరగడానికి కారణాలేంటో ఇప్పుడు చూద్దాం.
కారణాలివే..
పిల్లలు బరువు పెరగడానికి వాళ్ల లైఫ్‌స్టైల్ ప్రధానమైన కారణం. వేళకు తినడం, నిద్రపోవడం, ఆడుకోవడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా, చురుకుగా ఉంటారు. అలాకాకుండా వీడియో గేమ్స్ ఆడడం, మొబైల్స్ వాడడం, శారీరక శ్రమ లేకుండా ఇంట్లోనే ఎక్కువటైం గడపడం వల్ల పిల్లలు క్రమంగా బరువు పెరుగుతున్నారు.
బయట ఫుడ్, చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ లాంటివి తినడం కూడా పిల్లల్లో ఒబెసిటీకి మరో కారణం. అతిగారాబం వల్ల పిల్లలు అడిగిందల్లా కొనిస్తూ సరైన పౌష్టికాహారం పెట్టకపోవడం వల్ల పిల్లల్లో ఒబెసిటీ సమస్య వస్తుంది.
కుటుంబంలో ఎవరైనా ఒబేసిటీతో ఉన్నట్లయితే వాళ్ల పిల్లలు కూడా బరువు పెరిగే అవకాశం ఉంది. ఇలాంటి వాళ్లు క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల ఫిట్‌గా ఉండొచ్చు.
ఇక వీటితో పాటు ఒత్తిడి, పోషకాల లోపం లాంటివి కూడా పిల్లలు బరువు పెరిగేలా చేస్తాయి.
చిన్నవయసులోనే బరువు పెరగడం వల్ల వాళ్లలో డయాబెటీస్, బీపీ, ఆర్థరైటిస్ లాంటి సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుంది. కాబట్టి పిల్లల్లో ఒబెసిటీని తగ్గించడానికి ప్రయత్నించాలి.
జాగ్రత్తలు ఇలా..
పిల్లలకు ఫ్యాట్ ఫుడ్ తగ్గించి, ఫైబర్, ప్రోటీన్‌లు ఉండే ఆహారాన్ని ఎక్కువ ఇవ్వాలి.
పిల్లలు బయట ఫుడ్ తినకుండా చూడాలి. ఫ్రూట్స్, నట్స్ లాంటివి స్నాక్స్ టైంలో తినేలా అలవాటు చేయాలి.
పిల్లలకు మాంసాహారంతో పాటు సీజనల్ పండ్లు, కూరగాయలు కూడా ఎక్కువగా ఇస్తుండాలి.
తినకుండా మారాం చేసేపిల్లలకు ఐస్ క్రీమ్స్ లాంటివి కొనివ్వకుండా సూప్‌లు, జ్యూస్‌లు లాంటివి అలవాటు చేయాలి.
పిల్లలు రోజూ యాక్టివ్‌గా ఉండేలా చూడాలి. పిల్లల్ని బయట ఆడుకునేందుకు అనుమతివ్వాలి.
Obesity,Children Obesity,Children,Health Tips
prevent obesity, obesity, obesity disease, obesity prevention, Children obesity, what are the main causes of child obesity, healthy eating habits, Obesity health tips, Healthy Eating, healthy food haibits
https://www.teluguglobal.com//health-life-style/tips-for-parents-in-telugu-preventing-childhood-obesity-351964