http://www.teluguglobal.com/wp-content/uploads/2016/06/pista.gif
2016-06-27 01:49:17.0
పిస్తా పప్పులో మన ఆరోగ్యానికి మేలుచేసే మంచి లక్షణాలు ఎన్నో ఉన్నాయి. ఇది పోషక విలువలున్న వస్తాదే. కనుక తరచుగా దీన్ని తినటం మంచిది. ఫైబర్, ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నపిస్తా పప్పులను తినటం వలన పలు ఆరోగ్యలాభాలు పొందవచ్చు. –శరీరంలో ద్రవాలను సమతుల్యంలో ఉంచే పొటాషియం పిస్తాలో ఎక్కువగా ఉంది. –ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు గుండెజబ్బులను తగ్గించడంలో దోహదం చేస్తాయి. క్యాన్సర్ని నివారిస్తాయి. –వీటి ద్వారా శరీరానికి కేలరీలు తక్కువగా సమకూరి తక్షణశక్తి లభిస్తుంది. –పిస్తాలో […]
పిస్తా పప్పులో మన ఆరోగ్యానికి మేలుచేసే మంచి లక్షణాలు ఎన్నో ఉన్నాయి. ఇది పోషక విలువలున్న వస్తాదే. కనుక తరచుగా దీన్ని తినటం మంచిది. ఫైబర్, ప్రొటీన్లు పుష్కలంగా ఉన్నపిస్తా పప్పులను తినటం వలన పలు ఆరోగ్యలాభాలు పొందవచ్చు.
–శరీరంలో ద్రవాలను సమతుల్యంలో ఉంచే పొటాషియం పిస్తాలో ఎక్కువగా ఉంది.
–ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్లు గుండెజబ్బులను తగ్గించడంలో దోహదం చేస్తాయి. క్యాన్సర్ని నివారిస్తాయి.
–వీటి ద్వారా శరీరానికి కేలరీలు తక్కువగా సమకూరి తక్షణశక్తి లభిస్తుంది.
–పిస్తాలో విటమిన్ బి6తో పాటు చర్మానికి మేలుచేసే విటమిన్ ఇ సైతం పుష్కలంగా ఉంది.
–ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి. కొంచెం తిన్నా కడుపునిండినట్టుగా ఉండటం వలన ఆకలిని తగ్గించి అధికబరువు నివారణకు తోడ్పడతాయి.
ఇంకా ఇందులో హానికారక కొవ్వులు లేవు. కంటికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. జీర్ణశక్తిని పెంచే థియామిన్ కూడా ఎక్కువ మోతాదులో ఉంది. మొత్తంగా రోగనిరోధక శక్తిని పెంచటంలోనూ ఇది మిగిలిన నట్స్కంటే ముందే ఉంది. అయితే ఇందులో మోనోశాచ్యురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉండటం వలన వీటిని వారంలో 15 నుండి 20 గ్రాముల వరకు మాత్రమే తీసుకుంటే మేలు.
pista
https://www.teluguglobal.com//2016/06/27/pista/