పీఎంఏవై – ఎన్టీఆర్‌ నగర్‌లుగా జగనన్న కాలనీలు

2025-01-10 12:49:42.0

పేరు మార్చిన ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం

https://www.teluguglobal.com/h-upload/2025/01/10/1393375-ap-govt-houses.webp

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జగనన్న కాలనీల పేరు మార్చింది. (ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన) పీఎంఏవై – ఎన్టీఆర్‌ నగర్‌ నగర్‌గా ఈ కాలనీలకు నామకరణం చేసింది. జగన్మోహన్‌ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పేరుతో జగనన్న కాలనీల ఏర్పాటుకు భూములు కేటాయించారు. కూటమి ప్రభుత్వం కాలనీల పేరు మార్చుతూ నిర్ణయం తీసుకోవడంతో స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.