https://www.teluguglobal.com/h-upload/2024/10/07/500x300_1367052-pcod.webp
2024-10-07 14:19:56.0
గర్భదారణ సమస్యలే కాదు.. ప్రాణాంకతం అవుతుందని హెచ్చరిస్తున్న నిపుణులు
పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్ (పీసీవోడీ).. మహిళల్లో గర్భదారణ సమస్యకు ప్రధాన కారణం. పీసీవోడీ ఉన్నవాళ్లు తల్లికావడానికి మాత్రమే సమస్యలు ఎదురవుతాయని అందరికీ తెలుసు. కానీ అది ప్రాణాంతకం అవుతుందని వైద్య నిపుణులు హెచ్చరించారు. సాధారణంగా గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా పురుషుల్లోనే చూస్తుంటాం.. మనకు తెలిసిన ఆకస్మిక మరణాల్లో గుండెపోటుతో మృతిచెందిన పురుషులే ఎక్కువగా ఉంటారు. కానీ మహిళల్లోనూ హృద్రోగ సమస్యలు ఎక్కువేనని వైద్యులు చెప్తున్నారు. పీసీవోడీ, ఊబకాయంతో మహిళల్లో గుండె సమస్యలు పెరిగిపోతున్నాయని హెచ్చరిస్తున్నారు. ”గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ” వెల్లడించిన వివరాలను చూస్తే.. భారత మహిళలల్లో మరణానికి గుండె సంబంధ సమస్యలు 17 శాతం కన్నా ఎక్కువే ఉన్నాయని తెలుస్తోంది. పీసీవోడీ లైఫ్ స్టైల్ కు సంబంధించిన సమస్య. జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం, నైట్ డ్యూటీలు, ఊబకాయం లాంటి సమస్యల్లో మహిళల్లో పీరియడ్స్ ప్రతి నెలా రావు. అలాంటి వారిలోనే గుండె సమస్యలు ఎక్కువగా ఉన్నాయని స్టడీ వెల్లడిస్తోంది. రోజూ వ్యాయామం చేయడం, బీపీ, షుగర్ అదుపులో ఉంచుకోవడం, బరువు పెరగకుండా జాగ్రత్త తీసుకోవడంతో గుండె ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
PCOD,Women,Heart disease risk
PCOD, Women, Heart disease risk
https://www.teluguglobal.com//health-life-style/heart-disease-risk-for-women-with-pcod-1070195