పుణ్యక్షేత్రాల సందర్శనకు ఐఆర్‌సీటీసీ ప్రత్యేక రైలు

2024-11-19 03:28:54.0

https://www.teluguglobal.com/h-upload/2024/11/19/1378997-train.webp

అయోధ్య, కాశీ తదితర పుణ్యక్షేత్రాల సందర్శనార్థం వెళ్లే యాత్రికుల కోసం ఐఆర్‌సీటీసీ భారత్‌ గౌరవ్‌ ప్రత్యేక రైలు నడపనున్నది. మొత్తం 9 నైట్‌, 10 డే సమయాల్లో గల ఈ ప్యాకేజీలో రైలు డిసెంబర్‌ 11న తేదీన సికింద్రాబాద్‌లో బయలుదేరి 20 తిరుగు పయనమవుతుంది. విజయవాడ, రాజమండ్రి, సామర్లకోట, తుని మీదుగా పూరిలోని జగన్నాథ ఆలయం, గయలో విష్ణుపాద ఆలయం, వారణాసిలో కాశీ విశ్వనాథ ఆలయం, కాశీ విశాలాక్షి, అన్నపూర్ణాదేవీ, సాయంత్రం గంగా హారతి, అయోధ్యలో సరయు నది వద్ద రామజన్మభూమి, హనుమాన్‌ గర్హి, ప్రయోగ్‌రాజ్‌లో త్రివేణి సంగమం తదితర ప్రాంతాలను సందర్శించనున్నది. టీ, టిఫిన్‌, భోజనం, రవాణా, ప్రమాద బీమా అన్ని పన్నులతో కలిపి టికెట్‌ ధర ఒక్కొక్కరికీ స్లీపర్‌ తరగతిలో రూ. 16,800, థర్డ్‌ ఏసీలో రూ. 26,650, సెకెండ్‌ ఏసీలో 34,910 ఉంటుంది. టికెట్ల బుకింగ్‌ ఇతర వివరాలకు 9281495848, 8977314121 ఫోన్‌ నంబర్లలో సంప్రదించవచ్చు.

IRCTC,Bharat Gaurav Trains,Konark. Gaya,Varanasi,Ayodhya