2024-12-23 10:47:12.0
పుష్ప-2 సినిమాపై మంత్రి మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు.
పుష్ప సినిమాపై తెలంగాణ మంత్రి సీతక్క సంచలన వ్యాఖ్యలు చేశారు ఇవాళ ఆమె మీడియాతో మాట్లడారు. సమాజన్నికి మంచి సందేశం ఇచ్చిన జైభీమ్ లాంటి సినిమాలకు అవార్డులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి సినిమాకు ప్రోత్సహకాలు కూడా లేవని అన్నారు. ఒక స్మగ్లర్ పోలీసులను బట్టలు విప్పించి నిల్చోబెడితే నేషనల్ అవార్డులు ఇస్తున్నారని సీతక్క వాపోయారు. ఇది దేనికి సంకేతం అని ప్రశ్నించారు. స్మగ్లర్‌ను హీరో చేశారు.. పోలీసులు, లాయర్లను విలన్‌లను చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాలో స్మగ్లర్‌ను హీరో చేశారు.. పోలీసును విలన్ చేశారు. ఒక స్మగ్లర్ పోలీసుల దుస్తులు విప్పి నిలబెడితే జాతీయ స్థాయిలో అవార్డులు ఇవ్వడం దేనికి సంకేతం.
ఇలాంటి సినిమాలు నేర ప్రవృత్తిని పెంచేలా ఉన్నాయి. మానవతా దృక్పథం ఉన్న చిత్రాలు రావాలని మంత్రి సీతక్క కోరారు. ఇదిలా ఉండగా పుష్ప-2 సినిమా బెనిపిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఈ ఘటనపై కేసు నమోదు కాగా.. అల్లు అర్జున్ అరెస్టై జైలుకు కూడా వెళ్లి.. మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయంగానూ రచ్చ రేపింది. ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీలు అల్లు అర్జున్‌కు మద్ధతుగా నిలిచాయి. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ప్రస్తుతం ఈ అంశంపై రెండు తెలుగు రాష్ట్రాలో హాట్ టాపిక్‌గా నిలిచింది.
Minister Sitakka,Pushpa movie,Smuggler,Jai Bheem Movie,Sandhya Theater incident,Allu Arjun,CM Revanth reddy,Revathi,Chikkadapally Police,Telangana High Court,Chanchalguda Central Jail,BRS Party,KTR