2024-12-02 06:04:28.0
https://www.teluguglobal.com/h-upload/2024/12/02/1382621-pushapa.webp
పుష్ప-2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ నేపధ్యంలో వాహనదారులకు పోలీసులు బిగ్ అలర్ట్ ప్రకటించారు.
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప – 2 సినిమా ఈ నెల 5న రిలీజ్ కానుంది. పుష్ప-2 ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్లో సాయంత్రం 4 గంటల నుండి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని ఏసీపీ తెలిపారు. ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేశారు. ముఖ్యంగా జూబ్లిహిల్స్, అమీర్ పేట్, యూసఫ్ గూడ, పంజాగుట్ట, జూబ్లీ చెక్ పోస్టుల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన పోలీసులు.. ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని 300 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు ఏసీపీ తెలిపారు.
వేడుక ప్రాంతాన్ని నిన్న అదనపు కమిషనర్ (శాంతి భద్రతలు) విక్రమ్‌సింగ్ మాన్.. పశ్చిమ మండల డీసీపీ విజయ్‌కుమార్, పశ్చిమ మండల ట్రాఫిక్ ఏసీపీ కట్టా హరిప్రసాద్, జూబ్లీహిల్స్ ఇన్స్‌పెక్టర్ వెంకటేశ్వరరెడ్డి, శ్రేయాస్ మీడియా నిర్వాహకుడు శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించారు. ఇక అటు అల్లు అర్జున్ గతంలో నంద్యాలలో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన సంగతి తెలిసిందే. తన స్నేహితుడు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతుగా అల్లు అర్జున్ అక్కడికి వెళ్లిన విషయం తెలిసిందే. అల్లు అర్జున్ ఎన్నికల ప్రచారానికి, పుష్ప2 సినిమాకు లింక్ చేస్తూ టిడిపి ఎంపీ బైరెడ్డి శబరి చేసిన సెటైరికల్ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
Pushpa – 2 Movie,Allu Arjun,Pre release function,Yusuf Guda,Police Ground,Jubilee Hills,Amir Pate,Panjagutta,Jubilee Check Post,DCP Vijaykumar,Pushpa – 2 pre-release,rashmika,sukumar