పూరీ బీచ్‌ లో రేవంత్‌ సైకత శిల్పం

2024-11-07 07:12:48.0

బర్త్‌ డే సందర్భంగా ఏర్పాటు చేయించిన మెట్టు సాయికుమార్‌

https://www.teluguglobal.com/h-upload/2024/11/07/1375535-puri-beach-revanth.webp

ఒడిషాలోని పూరీ బీచ్‌ లో తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి సైకత శిల్పం ఏర్పాటు చేశారు. శుక్రవారం రేవంత్‌ రెడ్డి బర్త్‌ డే సందర్భంగా కాంగ్రెస్‌ నాయకుడు, ఫిషరీస్‌ ఫెడరేషన్‌ చైర్మన్‌ మెట్టు సాయికుమార్‌ ఈ సైకత శిల్పాన్ని ఏర్పాటు చేయించారు. సీఎం హోదాలో రేవంత్‌ రెడ్డికి ఇదే ఫస్ట్‌ బర్త్‌ డే కావడంతో కాంగ్రెస్‌ నాయకులు వివిధ రూపాల్లో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈక్రమంలో మెట్టు సాయికుమార్‌ పూరీ బీచ్‌ లో ప్రముఖ సైకత శిల్పి ఆధ్వర్యంలో రేవంత్‌ సైకత శిల్పం ఏర్పాటు చేయించారు. సైకత శిల్పంలో సీఎం రేవంత్‌ రెడ్డి చిత్రం, బర్త్‌ కేక్‌, కాంగ్రెస్‌ పార్టీ మూడు రంగుల జెండా చిత్రించారు.

CM Revanth Reddy,Birthday,Sand sculpture,Puri Beach,Mettu Saikumar