2025-01-29 08:12:12.0
ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని పీసీసీఎఫ్‌ను ఆదేశించిన ఏపీ డిప్యూటీ సీఎం
https://www.teluguglobal.com/h-upload/2025/01/29/1398519-pawan.webp
వైసీపీ నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అటవీ శాఖ ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని పీసీసీఎఫ్ (ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్)ను ఆదేశించారు. మంగళంపేట సమీపంలోని అడవుల్లో పెద్దిరెడ్డి భూ ఆక్రమణలకు చేసినట్లు ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించి అటవీ భూముల ఆక్రమణలు, అడవుల ధ్వంసంపై విచారణకు పవన్ ఆదేశించారు. విచారించి నివేదిక ఇవ్వాలని పీసీపీఎఫ్‌కు చెప్పారు. అటవీ భూముల ఆక్రమణలు, అడవుల ధ్వంసంపై విచారణ చేపట్టాలని స్పష్టం చేశారు. రికార్డుల తారుమారులో ఎవరి పాత్ర ఉన్నది.లబ్ధి పొందింది ఎవరో తేల్చాలని.. దీనిపై చట్టపరంగా ముందుకు వెళ్లాలని పవన్ సూచించారు.
జాయింట్ కమిటీ ఏర్పాటు
మరోవైపు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల ఆక్రమణలపై విచారణకు ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు జాయింట్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో చిత్తూరు కలెక్టర్ సుమిత్, ఎస్పీ మణికంఠ చందోలు, ఐఎఫ్‌ఎస్ అధికారి యశోదాబోయ్‌లను సభ్యులుగా నియమించింది. పూర్తిస్థాయిలో విచారణ చేసి నివేదిక సమర్పించాలని కమిటీని ఆదేశించింది. కమిటీ నివేదిక అనంతరం ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనున్నది.