పెన్ను విషయంలో వివాదం.. ప్రాణం తీసుకున్న విద్యార్థిని

https://www.teluguglobal.com/h-upload/2024/11/16/1378344-sucide.webp

2024-11-16 10:29:40.0

పల్నాడు జిల్లా నరసరావు పేటలో చోటుచేసుకున్న విషాద ఘటన

పల్నాడు జిల్లా నరసరావు పేటలో విషాద ఘటన చోటుచేసుకున్నది. పెన్ను విషయంలో స్నేహితురాలితో ఏర్పడిన స్వల్ప వివాదం నేపథ్యంతో ఓ విద్యార్థిని భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నది. బొల్లాపల్లి మండలం వెల్లటూర్‌కు చెందిన జెట్టి అనూష నరసరావుపేటలోని ప్రైవేట్‌ హాస్టల్‌లో ఉంటూ ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌ చదువుతున్నది. శనివారం ఉదయం హాస్టల్‌లో ఉన్న సమయంలో స్నేహితురాలితో పెన్ను విషయంలో స్వల్ప వివాదం జరిగింది. దీంతో మనస్తాపానికి గురైన అనూష హాస్టల్‌ భవనంలోని నాలుగో అంతస్తు నుంచి కిందికి దూకింది. హాస్టల్‌ సిబ్బంది హుటాహుటిన ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. కాలేజీ యాజమాన్యం ద్వారా విషయం తెలుసుకున్న నర్సనావు పేట ఆర్డీవో హేమలత, తహసీల్దార్‌ వేణుగోపాల్‌, నరసరావుపేట గ్రామీణ పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. 

Student died,Controversy,Narasa Rao Peta,Palnadu District