పేరు మార్చుకున్న కొత్త సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌

2024-12-04 13:01:16.0

మహారాష్ట్ర నూతన సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తన పేరు మార్చుకున్నరు.

https://www.teluguglobal.com/h-upload/2024/12/04/1383294-pendvies.webp

మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా బీజేపీ సీనియర్ నేత పేరు ఖరారైంది. ముంబైలోని ఆజాద్ మైదాన్ లో ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. డిప్యూటీ సీఎంలుగా ఏక్ నాథ్ షిండే, అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇదిలా ఉంటే.. దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఇన్విటేషన్ లెటర్ సర్ ఆసక్తికరంగా మారింది. మహారాష్ట్ర చీఫ్ సెక్రెటరీ సుజాత సౌనిక్ జారీ చేసిన ఈ లెటర్ లో ఫడ్నవీస్ పేరు దేవేంద్ర సరితా గంగాధరరావు ఫడ్నవీస్ అని ఉంది. ఫడ్నవీస్ తల్లి పేరు సరిత కాగా.. తండ్రి పేరు గంగాధర్.

సాధారణంగా మహారాష్ట్ర ప్రజలు తండ్రి పేరును మిడిల్ నేమ్ గా వాడుతారు. ఈసారి ఫడ్నవీస్ తల్లి పేరును కూడా తన పేరుకు జోడించారు. తల్లి పేరును వాడటం ఇదే మొదటి సారి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు దాఖలు చేసిన అఫిడవిట్ లో తన పేరును దేవేంద్ర గంగాధర్ ఫడ్నవీస్ గా పేర్కొన్నారు. 2014, 2019 ప్రమాణ స్వీకారోత్సవాల సమయంలో కూడా తన తల్లి పేరును తీసుకురాలేదు. ఫడ్నవీస్‌ తల్లిపేరు సరితా ఫడ్నవీస్‌,తండ్రి గంగాధర్ ఫడ్నవీస్. బీజేపీలో ఎమ్మెల్సీగా చేశారు. ఫడ్నవీస్‌ యుక్త వయస్సులో ఉన్నప్పుడే తండ్రి గంగాధర్ ఫడ్నవీస్ క్యాన్సర్‌ కారణంగా మరణించారు. ఫడ్నవీస్ భార్య అమృత ఫడ్నవిస్ బ్యాంకర్,సామాజిక కార్యకర్తగా పని చేస్తున్నారు. ఫడ్నవీస్‌ దంపతులకు కుమార్తె దివిజ ఉన్నారు. 

new CM Devendra Fadnavis,Maharashtra,Ek Nath Shinde,Ajit Pawar,changed his name,Devendra Sarita Gangadhara Rao Fadnavis,Mumbai,Azad ground,BJP,PM MODI,Amit shah