పేలిపోయిన స్టార్‌షిప్‌ రాకెట్‌

2025-01-17 02:46:14.0

స్సేస్‌ ఎక్స్‌ ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన పునర్వినియోగ భారీ రాకెట్‌ స్టార్‌షిప్‌ విఫలం

అంతరిక్ష రంగంలో క్రమంగా పురోగతి సాధిస్తున్న ఎలాన్‌ మస్‌కు చెందిన స్సేస్‌ ఎక్స్‌ సంస్థకు పెద్ద కుదుపు. స్సేస్‌ ఎక్స్‌ ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన పునర్వినియోగ భారీ రాకెట్‌ స్టార్‌షిప్‌ విఫమైంది. టెక్సాస్‌లోని బొకా చికా వేదిక నుంచి గురువారం సాయంత్రం 4.37 గంటలకు రాకెట్‌ను ప్రయోగించారు. అయితే రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లాక మధ్యలోనే దానిపై భాగం సాంకేతిక కారణాలతో పేలిపోయింది. దీంతో శకలాలు కరేబియన్‌ సముద్రంలో పడ్డాయి. కిందిభాగం బూస్టర్‌ క్షేమంగా భూమిపైకి చేరింది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. రాకేట్‌ పోలిపోవడంతో స్సేస్‌ఎక్స్‌ స్పందించింది. ప్రయోగానికి సంబంధించిన ముఖ్యమైన సమాచారం సేకరించినట్లు పేర్కొన్నది. ప్రయోగం విఫలమైనప్పటికీ ఇది స్టార్‌షిప్‌ విశ్వసనీయతను పెంచిందని తెలిపింది. 232 అడుగుల భారీ రాకెట్‌ అయిన దీనిలో మొత్తం 33 రాప్టార్‌ ఇంజిన్లు వాడారు. 

Starship explodes,After launch,Debris seen falling from space,SpaceX acknowledged