పోచారం మున్సిపాలిటీలో హైడ్రా కూల్చివేతలు

2025-01-25 04:42:00.0

నారపల్లి దివ్యానగర్ లేఅవుట్స్‌లో రోడ్డుకు అడ్డంగా నిర్మించిన ప్రహరీ గోడలను కూల్చివేసిన సిబ్బంది

హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధి నారపల్లి దివ్యానగర్లో హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. ఇక్కడి లేఅవుట్స్‌లో రోడ్డుకు అడ్డంగా నిర్మించిన ప్రహరీ గోడలను సిబ్బంది కూల్చివేశారు. స్థానికుల ఫిర్యాదు మేరకు ఈ నెల 12న హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌ దిద్యానగర్‌ లేఅవుట్స్‌ను పరిశీలించారు. అక్రమ కట్టడాల నిర్మాణంపై ఆరా తీశారు. అధికారులు సర్వే చేసి ప్రభుత్వ స్థలంలో ప్రహరీ నిర్మించారని గుర్తించారు. తాజాగా శనివారం వాటి కూల్చివేతలు చేపట్టారు.

Hydra,Demolitions,In Pocharam Municipality,Narapalli,Divyanagar Layouts