‘పోలవరం ‘పనులను పరిశీలిస్తున్నకేంద్ర పార్లమెంటరీ కమిటీ

2025-01-11 06:57:00.0

ప్రాజెక్టు నిర్మాణ పనుల తీరుపై అధ్యయనం చేయనున్న పార్లమెంటు సభ్యుల కమిటీ

https://www.teluguglobal.com/h-upload/2025/01/11/1393547-polavaram.webp

కేంద్ర పార్లమెంటరీ కమిటీ పోలవరం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నది. 10 మంది సభ్యుల కమిటీ ప్రాజెక్టు నిర్మాణ పనుల తీరుపై అధ్యయనం చేయనున్నది. కమిటీ ఛైర్మన్‌ రాజీవ్‌ ప్రతాప్‌ సింగ్‌ రూఢీ ఆధ్వర్యంలో కాఫర్‌ డ్యాం, డయాఫ్రం వాల్‌, స్పిల్‌వే, ఛానల్స్‌ను పరిశీలించనున్నారు. అనంతరం ప్రాజెక్టు అధికారులు, ఇంజినీరింగ్‌ నిపుణులతో నిర్మాణ తీరుపై సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. దీనిపై కేంద్రానికి నివేదిక సమర్పించనున్నారు.