2024-11-06 12:05:47.0
గత వైసీపీ ప్రభుత్వం వల్లే ఏపీ పోలీసులు ఇలా తయారయ్యారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ క్రమంలో వారందరినీ కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్‌కు చెప్పారు.
https://www.teluguglobal.com/h-upload/2024/11/06/1375357-cbn123.webp
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్స్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. మంత్రుల పనితీరు మెరుగుపరుచుకోవాలని సీఎం సూచించారు. చాలా మంది మంత్రులకు ఇంకా సీరియస్‌నెస్ రావడం లేదని చంద్రబాబు అన్నారు. కొంత మంది మంత్రులకు ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోవడం లేదు.. మంచిగా ఉండొచ్చు, కానీ మెతకగా ఉండకూడదని సీఎం దిశానిర్థేశం చేశారు. వైసీపీ ప్రభుత్వం వల్లే ఏపీ పోలీసులు ఇలా తయారయ్యారని సీఎం చంద్రబాబు అన్నారు.
ఈ క్రమంలో వారందరినీ కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్‌కు చెప్పారు. కొంతమంది డబ్బులు తీసుకుంటున్నారనీ ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. నెల రోజుల్లో మొత్తం పోలీస్ వ్యవస్థను దారిలోకి తెస్తానని పవన్‌కు చంద్రబాబు చెప్పారు. శాంతి భధ్రతలు అంటే ఎలా ఉంటుందో వైసీపీ నేతలకు చూపిద్దామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇకపై సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి హెచ్చారించారు.