2025-03-18 06:26:14.0
నిందితుడిని ఢిల్లీకి చెందిన అక్రమ్‌గా గుర్తించిన పోలీసులు
బీజేపీ ఎంపీ డీకే అరుణ ఇంట్లో చొరబడిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని ఢిల్లీకి చెందిన అక్రమ్‌గా గుర్తించారు. అతడిని వెస్ట్ జోన్ డీసీసీ విజయ్‌కుమార్, జూబ్లీహిల్స్ పోలీసులు విచారిస్తున్నారు. ఎంపీ ఇంట్లోకి చొరబడటానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. అక్రమ్ గతంలో హైదరాబాద్‌లోని పాతబస్తీ, ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో చోరీలకు పాల్పడినట్లు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో సీపీ సీవీ ఆనంద్ సోమవారం ఎంపీ ఇంటికి చేరుకుని వివరాలను సేకరించి విషయం విదితమే.
ఆదివారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 56లోని ఎంపీ ఇంట్లోకి నిందితుడు ముసుగు వేసుకుని ఇంటి వెనక నుంచి లోపలికి వెళ్లాడు. సీసీ కెమెరా వైర్లను కత్తిరిం,ఇ సుమారు గంట పాటు ఇంట్లో తిరిగి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఎంపీ కుమార్తె పొద్దుగాల నిద్రలేచి చూసే సరికి ఇల్లంతా చిందరవందరగా ఉన్నది. కిచెన్ రూమ్ కిటీకి గ్రిల్ తొలిగించడం గమనించారు. దీనిపై ఎంపీ డ్రైవర్ లక్ష్మణ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
MP DK Aruna,Masked man breaks into house,Filed a complaint at the Jubilee Hills police,Accused Akram from Delhi. Police custody