https://www.teluguglobal.com/h-upload/2024/09/25/1362833-jani-master.webp
2024-09-25 08:12:11.0
నాలుగు రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు ఆదేశాలు జారీ
అత్యాచారం ఆరోపణలు, పోక్సో కేసులో అరెస్టైన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతిచ్చింది. నాలుగు రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ రంగారెడ్డి జిల్లా ప్రత్యేక పోక్సో కోర్టు ఆదేశాలు జారీ చేసింది. థర్డ్ డిగ్రీ ప్రయోగించవద్దని.. అవసరమైతే న్యాయవాది సమక్షంలో విచారించాలని సూచించింది.
జానీ మాస్టర్ ప్రస్తుతం చంచల్‌గూడ జైలులో ఉన్నారు. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఫిర్యాదు మేరకు ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతిచ్చిన నేపథ్యంలో పోలీసులు చంచల్‌గూడ జైలుకు వెళ్లారు. ఈ నెల 28 వరకు నార్సింగి పోలీసులు ఆయనను ప్రశ్నించనున్నారు.
Johnny Master,Police Custody,allegations of sexual assault,Special POCSO court orders