2025-03-08 07:21:06.0
కర్నూలు జిల్లా జైలు నుంచి విజయవాడలోని భవానీపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించిన పోలీసులు
వైసీపీ నేత, సినీ నటుడు పోసాని కృష్ణమురళిని విజయవాడలోని భవానీపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పిటీ వారెంట్‌పై కర్నూలు జిల్లా జైలు నుంచి ఆయనను ఇక్కడికి తరలించారు. దీనిపై వైసీపీ మండిపడుతున్నది. కూటమి ప్రభుత్వం కావాలనే పోసానిని వేధిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేసింది. కూటమి పార్టీల నేతలు పెట్టిన కేసుల్లో ఆయనకు ఊరట దక్కుతున్నదని, ఈ క్రమంలోనే ఆయనను ఇంకో కేసులో ఇరికించి మరో పీఎస్‌కు తరలిస్తున్నారని ఆరోపిస్తున్నది.
శుక్రవారం అర్ధరాత్రి నరసరావు పేట పోలీస్ కస్టడీ పిటిషన్‌ను కోర్టు రద్దు చేసింది. దీంతో ఆఘమేఘాల మీద విజయవాడ భవానీ పురం పోలీసులు కర్నూల్ జైలుకు చేరుకున్నారు. ప్రిజినర్ ట్రాన్సిట్ వారెంట్ కింద పోసానిని హైదరాబాద్ మీదుగా విజయవాడకు తరలిస్తున్నారు. కోర్టు రిమాండ్ విధిస్తే పోసానిని విజయవాడ జైలుకు తరలించే అవకాశం ఉన్నది. రిమాండ్ విధించని పక్షంలో మరోసారి కర్నూలు జైలుకు పంపించనున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు, వారి కుటుంబసభ్యులు, మీడియా సంస్థలపై దూషణలు, సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో ఆయనపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి.
Another case,On Posani Krishna Murali,Vijayawada bhavanipuram PS,Karnool Jail